వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాల్‌మార్ట్ స్టోర్‌లో యథేచ్ఛగా కాల్పులు - బలి తీసుకున్న మేనేజర్..!!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ పేలింది. 14 మందిని బలి తీసుకుంది. పలువురిని గాయపరిచింది. తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి అక్కడి ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలేవీ సరిపోవట్లేదు. రోజూ ఇలాంటి కాల్పుల ఘటనలు సంభవిస్తూనే వస్తోన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి 600 సంఘటనలు చోటు చేసుకున్నాయి. సగటున ప్రతిరోజూ అమెరికాలో రెండు చోట్ల మాస్ షూటింగ్ జరుగుతోంది.

ఉక్కుపాదం మోపినా..

దీన్ని నివారించడానికి జో బైడెన్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా ఆయుధ నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చింది. 18 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారికి ఆయుధాలను విక్రయించడాన్ని నిషేధించింది. ఆటోమేటిక్ గన్స్ వినియోగంపైనా ఆంక్షలను విధించింది. అందరికీ గన్ లైసెన్స్‌ను ఇవ్వడంపై ఉక్కుపాదం మోపింది. ఇంతా చేసినప్పటికీ అమెరికాలో గన్ కల్చర్‌కు మాత్రం అడ్డుకట్ట పడట్లేదు.

మొన్నటికి మొన్న నైట్ క్లబ్‌లో..

మొన్నటికి మొన్న కొలరాడోలోని ఓ నైట్ క్లబ్‌లో సంభవించిన కాల్పుల ఘటనలో అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. మరో 18 మంది గాయపడ్డారు. కొలరాడో స్ప్రింగ్స్‌లో గల క్లబ్ క్యూ అనే నైట్ క్లబ్‌లో ఈ కాల్పుల ఘటన సంభవించింది. ఇది గే నైట్ క్లబ్. దీని పేరు క్లబ్ క్యూ. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్లబ్ ఇది. గే, లెస్బియన్లు రోజూ ఈ క్లబ్‌లో కలుస్తుంటారు. ఈ నెల 19వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.

వాల్‌మార్ట్ స్టోర్‌లో..

ఇప్పుడు తాజాగా వాల్‌మార్ట్ స్టోర్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. వర్జీనియాలోని చెసాపీక్‌లో ఉందీ వాల్‌మార్ట్ స్టోర్. యూఎస్ కాలమానం ప్రకారం రాత్రి 10:12 నిమిషాల సమయంలో కాల్పులు జరిగినట్లు చెసాపీక్ పోలీస్ అధికారి లియో కొసిన్‌స్కీ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా నిర్ధారణ కావట్లేదని చెప్పారు. 10 మంది వరకు చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నామని అన్నారు. స్టోర్ మేనేజర్ ఈ కాల్పలకు తెగబడినట్లు అనుమానిస్తోన్నామని వివరించారు.

భయభ్రాంతులు..

భయభ్రాంతులు..

కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోయింది. షాపింగ్ చేయడానికి వచ్చిన వారందరూ ఒక్కసారిగా బయటికి వెళ్లడానికి ప్రయత్నించడంతో స్వల్పంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనపై వాల్‌మార్ట్ ఉద్యోగి ఒకరు తన స్వీయ అనుభవాన్ని వివరిస్తూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్‌గా మారింది.

జనసేన కొలాటెరల్ డ్యామేజ్ - టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానానికి ఎసరు..!!జనసేన కొలాటెరల్ డ్యామేజ్ - టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానానికి ఎసరు..!!

English summary
Police in Chesapeake, Virginia, are responding to a shooting at a Walmart with multiple fatalities and injuries, Chesapeake Police public information officer Leo Kosinski told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X