చైనాకు అమెరికా హెచ్చరిక: ఈసారి మసూద్‌కు మద్దతు ఇస్తే ఖబడ్దార్..!
వాషింగ్టన్ : పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ జైషేమహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యభద్రతా మండలిలో పలు శాశ్వత సభ్య దేశాలు యోచిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా చైనా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోంది. నిబంధనల ప్రకారం శాశ్వతసభ్యత్వం ఉన్న అన్ని దేశాలు తమ అభిప్రాయం తెలిపితేనే అది చెల్లుతుందని చైనా వాదిస్తోంది. ఇక తీర్మానం పాస్ చేసేందుకు మరికొద్ది గంటల మాత్రమే సమయం ఉంది.
మసూద్ అజార్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి అతనిపై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను 1267 ఆంక్షల కమిటీ ముందు ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్ దేశాలు ఫిబ్రవరి 27న తీసుకొచ్చాయి. అయితే ఉగ్రవాదంను సహించేది లేదంటూ చైనా చెబుతూనే మరోవైపు మాత్రం అజార్‌కు అండగా నిలుస్తుండటం అమెరికాకు ఎంతమాత్రం రుచించడం లేదు. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అమెరికా చైనా తీరును తప్పుబడుతూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మసూద్ అజార్‌పై ఆంక్షల అంశంపై ఈ సారి చైనా అడ్డుకుంటే బాగుండదని హెచ్చరించింది. మసూద్ అజార్ ఉగ్రవాద సంస్థ జైషేమహ్మద్‌ను నడుపుతున్నారని ఇంతకంటే రుజువులు ఇంకేం కావాలని చైనాను సూటిగా ప్రశ్నించారు అమెరికా విదేశాంగా ప్రతినిధి రాబర్ట్ పాలాడినో. మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను చైనా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని అన్నారు పాలడినో.
ప్రాంతీయ స్థిరత్వం, శాంతి నెలకొనేలా రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని అదే సమయంలో అజార్‌పై ఆంక్షలు విధించకపోతే మానవాళికి ప్రమాదంగా మారే అవకాశముందని పాలిడినో అన్నారు. భారత విదేశాంగా కార్యదర్శి విజయ్ గోఖలే అమెరికా పర్యటనలో ఉన్న సందర్భంగా పాలిడినో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.గోఖలే అమెరికా విదేశాంగ కార్యదర్శి డేవిడ్ హేల్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఉగ్రవాదంపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications