యుద్ధం మధ్యలో ఉక్రెయిన్‌కు హ్యాండిచ్చిన అమెరికా- జో బైడెన్ కీలక ప్రకటన..!!

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24వ తేదీతో ఈ యుద్ధానికి ఏడాది నిండుతుంది. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు.

 ఒత్తిళ్లను ఎదుర్కొంటూ..

ఒత్తిళ్లను ఎదుర్కొంటూ..


ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.

ఉక్రెయిన్ ప్రతిఘటన..

ఉక్రెయిన్ ప్రతిఘటన..

రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. 11 నెలలుగా రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటోంది. కొన్ని సందర్భాల్లో పైచేయిని సాధించింది కూడా. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం చుట్టుముట్టినప్పటికీ..వారిని వెనక్కి పంపించగలిగింది.

 అమెరికా కీలక ప్రకటన..

అమెరికా కీలక ప్రకటన..

ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ కు ఎఫ్ 16 యుద్ధ విమానాలను సరఫరా చేయడాన్ని నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ కు ఆయుధ సహాయాన్ని అందించడంలో భాగంగా ఎఫ్ 16 యుద్ధ విమానాలను సరఫరా చేయడాన్ని తాను వ్యతిరేకిస్తోన్నానని స్పష్టం చేశారు. వైట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

అత్యాధునిక ఆయుధ సరఫరా..

అత్యాధునిక ఆయుధ సరఫరా..

ఎఫ్ 16తో పాటు అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేయడానికి తాను వ్యతిరేకిస్తోన్నానని జో బైడెన్ నిర్మొహమాటంగా తేల్చేశారు. ఉక్రెయిన్ నైతిక మద్దతును తెలియజేయడానికి తాను పోలెండ్ లో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేయాల్సిందిగా తన స్టాఫ్ కు ఆదేశించానని చెప్పారు జో బైడెన్. 11 నెలలుగా రష్యాతో పోరాడుతున్న తమకు మరిన్ని ఆయుధాలను అందించాలని, వాటి సరఫరాను వేగవంతం చేయాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేసిన కొన్ని గంటల్లోనే జో బైడెన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఆయుధ సరఫరా పెంచాలంటూ..

ఆయుధ సరఫరా పెంచాలంటూ..

రష్యా ఉద్దేశపూరకంగానే యుద్ధాన్ని పొడిగించుకుంటూ పోతోందని, నార్త్ అట్లాంటిక్ ట్రీటి ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్.. ఇతర దేశాల నుంచి తమకు సకాలంలో ఆయుధాలు అందాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. ఇదే విషయాన్ని విలేకరులు జో బైడెన్ వద్ద ప్రస్తావించారు. ఎఫ్ 16 వంటి అత్యాధునిక జెట్ ఫైటర్లు, ఆయుధ సామాగ్రిని సరఫరా చేయడానికి తాను వ్యతిరేకిస్తోన్నానని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+