సంచలన నిర్ణయం: యునెస్కో నుంచి వైదొలిగిన అమెరికా, కారణమదేనా?..

ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేష‌న్స్ ఎడ్యుకేష‌న‌ల్‌, సైంటిఫిక్ అండ్ క‌ల్చ‌ర‌ల్ ఆర్గ‌నైజేష‌న్ (యునెస్కో) నుంచి అమెరికా వైదొలిగింది.

హైదరాబాద్: ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేష‌న్స్ ఎడ్యుకేష‌న‌ల్‌, సైంటిఫిక్ అండ్ క‌ల్చ‌ర‌ల్ ఆర్గ‌నైజేష‌న్ (యునెస్కో) నుంచి అమెరికా వైదొలిగింది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది.

అమెరికా తాజా నిర్ణయం 2018 డిసెంబరు 31 నుంచి అమలులోకి వస్తుందని స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. యునెస్కో నుంచి వైదొలుగుతున్నప్పటికీ.. శాశ్వత పరిశీలకుడి హోదాలో మాత్రం కొనసాగుతామని ప్రకటించడం గమనార్హం.

 ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాల వల్లే:

ఇజ్రాయెల్ వ్యతిరేక విధానాల వల్లే:

ఇజ్రాయెల్ పట్ల యునెస్కో అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికార ప్రతినిధి హెదర్ వెల్లడించారు. ట్రంప్ నిర్ణయం యునెస్కోలో పేరుకుపోయిన బకాయిలపై అమెరికా ఆందోళనలను ప్రతిబింబిస్తోందని అన్నారు. యునెస్కోలో సమూల సంస్కరణలు జరగాల్సిన అవసరముందన్నారు.

 నష్టం చేసే నిర్ణయం:

నష్టం చేసే నిర్ణయం:

యునెస్కో కొత్త డైరెక్టర్‌ కోసం ఓటింగ్‌కు వెళ్తున్న సమయంలో అమెరికా వైదొలగడం సంచలనంగా మారింది. అమెరికా తీసుకున్న నిర్ణయం బహుళత్వానికి నష్టం చేకూరుస్తుందని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

 ఎందుకీ నిర్ణయం:

ఎందుకీ నిర్ణయం:

ఇజ్రాయెల్ తో ఉన్న మిత్రుత్వం.. దాని శత్రు దేశమైన పాలస్తీనాకు యునెస్కో ఇస్తున్న ప్రాధాన్యం అమెరికాకు నచ్చలేదు. తమ అభ్యంతరంతో నిధుల పంపిణీ నుంచి వెనక్కి తగ్గినా.. పారిస్ లోని ప్రధాన కార్యాలయంలో కార్యకలాపాలు మాత్రం కొనసాగుతూ వస్తున్నాయి. ఈ కారణాలతో తీవ్ర అసంత్రుప్తికి లోనైన అమెరికా యునెస్కో నుంచి తప్పుకుంది.

పాలస్తీనాను ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు ప్రత్యేక దేశంగా గుర్తించటం అమెరికాకు ఏమాత్రం ఇష్టంలేదు. అలాంటిది 2011లో పాలస్తీనా అథారిటీకి యునెస్కో సభ్యత్వం ఇచ్చింది. ఈ పరిణామం అమెరికాకు మింగుడు పడలేదు. అమెరికా అభ్యంతరాలతో యునెస్కో కూడా నిధుల పంపిణీ నిలిపివేసింది.

 ఇదే తొలిసారి కాదు:

ఇదే తొలిసారి కాదు:

యునెస్కో అనుసరిస్తున్న ఇజ్రాయెల్‌ వ్యతిరేక విధానాలపై అమెరికా ఐరాసలో అమెరికా అంబాసిడర్‌ నిక్కీ హేలీ కొంత కాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ట్రంప్.. తప్పుకునేందుకే మొగ్గుచూపారు. అయితే యునెస్కో నుంచి అమెరికా వైదొలగటం ఇదే తొలిసారి కాదు. సోవియట్‌ యూనియన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలతో 1984 లో రొనాల్డ్‌ రీగన్‌ హయాంలో యునెస్కో నుంచి నిష్క్రమించింది. 2002లో జార్జ్‌ డబ్ల్యూ బుష్ హయాంలో యునెస్కోలో చేరింది.

Recommended Video

    Donald Trump’s Daughter Ivanka Trump Scheduled to visit Hyderabad
     అమెరికా బాటలోనే ఇజ్రాయెల్:

    అమెరికా బాటలోనే ఇజ్రాయెల్:

    అమెరికా వైదొలిగిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ కూడా ఐరాస నుంచి వైదొలిగింది. యునెస్కో నుంచి తాము తప్పుకుంటున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యాచరణను సిద్దం చేయాల్సిందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖను నెతన్యాహు ఆదేశించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+