కోపంతో ప్రియుడిపైకి ట్రక్ ఎక్కించిన మహిళ

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కింగ్ స్పోర్ట్‌కు చెందిన క్రిస్టల్ గ్రీర్ బ్రూక్స్, శాంటియాగో హెర్నాండేజ్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. గత బుధవారం క్రిస్టల్ బ్రూక్స్, హెర్నాండేజ్, మరో పరిచయస్తుడైన ఓ వ్యక్తి కలిసి మద్యం సేవించారు. ఆ తర్వాత ఏదైనా తిందామనే ఉద్దేశంతో బయటికి వచ్చారు. అయితే తనకు ఇష్టమైన మెక్ డోనాల్డ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియురాలు వారు ప్రయాణిస్తున్న ట్రక్కును రోడ్డు పక్కన ఆపమని కోరింది.
దీంతో హెర్నాండేజ్ రోడ్డు పక్కనే వాహనాన్ని నిలిపేశాడు. ఆ తర్వాత వాహనం దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. అతన్నిరోడ్డుపై పడేసిన క్రిస్టల్ వాహనాన్ని అతనిపై నుంచి మూడు సార్లు ఎక్కించింది. అయితే తన ప్రియుడ్ని కావాలని ట్రక్కుతో ఢీకొట్టలేదని నిందితురాలు చెబుతోంది.
ట్రక్ ఎక్కించడంతో ప్రియుడు హెర్నాండేజ్‌కు గాయాలయ్యాయి. చికిత్స అందించిన అనంతరం బాధితుడ్ని తన స్నేహితుల ఇంటికి చేర్చారు పోలీసులు. ప్రియురాలు క్రిస్టల్ గ్రీర్ బ్రూక్స్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను సిటీ జైలుకు తరలించారు. కాగా క్రిస్టల్ గ్రీర్ బ్రూక్స్, హెర్నాండేజ్‌లకు ఓ చిన్నారు కూడా ఉంది.












Click it and Unblock the Notifications