వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాను తగ్గించే ఆయింట్ మెంట్ ... యూఎస్ఎఫ్‌డీఏ ఆమోదం

|
Google Oneindia TeluguNews

ప్రపంచాన్ని గజాగజా వణికిస్తున్న కరోనా వైరస్ కు చెక్ పెట్టడం కోసం ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ ను కనుగొనడానికి తీవ్ర యత్నాలు చేస్తున్నాయి. చాలా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ లో మూడో దశకు చేరుకున్నాయి. అయితే క్లినికల్ ట్రయల్స్ పూర్తయి కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తుంది . ఇదే సమయంలో కరోనా నివారణ కోసం పోటీపడి మరీ టాబ్లెట్లను, మందులను అందుబాటులోకి తెస్తున్నాయి పలు కంపెనీలు. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఫార్మా కంపెనీ కరోనా నివారణ కోసం ఏకంగా ఒక ఆయింట్మెంట్ తయారు చేసింది.

Recommended Video

COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia

కరోనావైరస్ తో సహా వైరల్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి, చికిత్స చేయడానికి మరియు చంపడానికి FDA- రిజిస్టర్డ్ నాన్-ప్రిస్క్రిప్షన్ ఓవర్ ది కౌంటర్ (OTC) ఆయింట్ మెంట్ గా సంస్థ తయారు చేసిన ఆయింట్ మెంట్ నిరూపించబడిందని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు తెలిపారు. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం, 30 సెకన్ల టి 3 ఎక్స్ చికిత్స తర్వాత కరోనా వైరస్ కనిపించలేదు అని ఫార్మా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

USFDA approved Corona-reducing ointment

కరోనా సహా పలు వైరస్‌లను సంహరించే గుణం తమ ఆయింట్‌మెంట్‌కు ఉందని, అందుకు యూఎస్ఎఫ్‌డీఏ ఆమోదం లభించిందని ఆ కంపెనీ పేర్కొంది . అంతే కాదు దీనిని కొనుగోలు చేయడం కోసం ఎలాంటి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదని పేర్కొంది.

ఏపీటి టీ3 ఎక్స్ పేరుతో దీనిని తయారు చేసినట్లుగా సంస్థ వెల్లడించింది. లండన్ ఆధారిత పరిశోధనా ప్రయోగశాల, వైరాలజీ రీసెర్చ్ సర్వీసెస్ లిమిటెడ్, కరోనా వైరస్ (ఎన్ఎల్ 63) మరియు ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్లకు వ్యతిరేకంగా APT TM T3X అని పిలువబడే ఉత్పత్తి యొక్క యాంటీ-వైరల్ ప్రభావాన్ని అంచనా వేసి అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని తేల్చింది .

చైనా కోవిడ్ వ్యాక్సిన్ .. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ .. ధర చూస్తే బెదిరిపోవాల్సిందే!!చైనా కోవిడ్ వ్యాక్సిన్ .. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ .. ధర చూస్తే బెదిరిపోవాల్సిందే!!

ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్ నుండి తప్పించుకోవడానికి ఇది కచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కరోనా వైరస్ తో పాటుగా, ఇన్ఫ్లూయెంజా వైరస్ పై కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని, కరోనా వ్యాపించే శక్తిని నిర్వీర్యం చేస్తుందని కంపెనీ వెల్లడిస్తోంది. దీనిని ముక్కులోకి పీల్చుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తిని దాదాపుగా అడ్డుకోవచ్చని సంస్థ వెల్లడించింది.

English summary
A US pharma company has successfully tested a Food and Drug Administration-approved over the counter ointment as the first line of defence against the deadly coronavirus that has so far killed over eight lakh people globally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X