Viral Love Story: అమెరికా లగ్జరీ లైఫ్ వదిలి.. పాకిస్థాన్ లోని చిన్న పల్లెకు..

అమెరికాకు చెందిన ఓ యువతి.. పాకిస్థాన్ కు చెందిన ఓ యువకుడ్ని పెళ్లి చేసుకుని అక్కడే ఓ గ్రామంలో జీవనం సాగిస్తోంది. ఈ మేరకు తన డైలీ లైఫ్ ను వివరిస్తూ ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. అందులో పొలం, పశుపోషణ, అక్కడి సంప్రదాయ పద్దతులను అలవరుచుకుని నివసిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొందరు ఈమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు.

అమెరికాకు చెందిన టేలర్ అనే యువతి.. పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని అక్కడే ఓ మారుమూల గ్రామంలో జీవనం సాగిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు తన లైఫ్ ఇదేనంటూ ఆమె ఇటీవల ఇన్ స్టాలో ఓ వీడియో పోస్టు చేసింది. పాకిస్థాన్ లోని ఓ చిన్న గ్రామమే ఇప్పుడు తన లైఫ్ అని పేర్కొంది. ఆ వీడియోలో టేలర్ తన భర్తతోపాటుగా.. పొలం, ద్విచక్ర వాహనాలు, పక్షులు, పశువులు, డేసీ టాయిలెట్ తదితర అంశాలు కనిపించాయి.

USWoman Viral Pakistani Marriage viral video Settling in Village with Husband Mixed Reactions

"నేను పాకిస్థాన్ లో స్థిరపడతానని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడున్న జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను" అని టేలర్ స్పష్టం చేసింది. అయితే టేలర్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె స్వర్గం నుంచి నరకానికి వెళ్లిందని.. ఒకరు కామెంట్ పెట్టారు. నేనూ పాకిస్థానీనే కానీ నేను అలా జీవించాలని అనుకోవట్లేదని మరొకరు కామెంట్ పోస్టు చేశారు. మరొకరు కామెంట్ చేస్తూ ప్రేమ కొన్నిసార్లు గుడ్డిది అని తెలిపారు.

మరికొంతమంది మాత్రం.. ఆమె మేజర్ సిటీలను వదిలి గ్రామంలో జీవితాన్ని ఎందుకు ఎంచుకుంది..? అని మాట్లాడుకుంటున్నారు. లాహోర్, ఇస్లామాబాద్ లాంటి నగరాలు ఉండగా.. పల్లెలోనే ఎందుకు ఉండాలని కోరుకుంటున్నారు..? అని ప్రశ్నించారు. ఇంకొంత మంది మాత్రం ఆమె సంతోషాన్ని అక్కడే వెతుక్కుంటోందని అంటున్నారు. ప్రస్తుతం ఆమెను ద్వేషించే వారితో పోల్చితే ఆమెనే సంతోషంగా, ప్రశాంతంగా నిద్రపోతుందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+