వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 రెట్లు తక్కువ ఇంపాక్ట్: టీకానే శ్రీరామ రక్ష, తాజా పరిశోధనలో వెల్లడి

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వివిధ వేరియంట్లతో విజృంభిస్తోంది. వైరస్‌కు విరుగుడు టీకానే.. ఇదే విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నారు. దీంతో ప్రభుత్వాలు కూడా ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడంపై ఫోకస్ చేశారు. అయితే టీకాలు వేసుకోవడం.. టీకా తీసుకున్న వారిలో రోగ నిరోదక శక్తి గురించి రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. తాజాగా లండన్ ఇంపిరీయల్ కాలేజీ పరిశోధకులు కూడా ఇదే విషయాన్ని తెలిపారు.

ముప్పు 3 రేట్లు తక్కువ

ముప్పు 3 రేట్లు తక్కువ

కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్‌ ముప్పు 3 రెట్లు తగ్గుతుందని తాజా పరిశోధనలో కూడా తేలింది. డెల్టా వేరియంట్‌ వంటి కొత్త రకాల నుంచి వ్యాక్సిన్ ద్వారా రక్షణ పొందవచ్చని తాజా పరిశోధనలో వెల్లడయ్యింది. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు జూన్‌ 24 నుంచి జులై 12 మధ్య.. కోవిడ్ వ్యాప్తి, వ్యాక్సిన్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఓ అధ్యయనం చేపట్టారు. దాదాపు 98 వేల మందిపై పరిశోధనలు చేశారు. రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారిలో సగం మంది మాత్రమే వైరస్‌ బారినపడే ప్రమాదం ఉందని పరిశోధకులు గుర్తించారు.

ఇదీ లెక్క

ఇదీ లెక్క

వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రతి 120మందిలో ఒకరికి వైరస్‌ సోకగా, వ్యాక్సిన్‌ తీసుకోని ప్రతి 40మందిలో ఒకరికి వైరస్‌ సోకుతుందని పరిశోధకులు గుర్తించారు. వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో వైరస్‌ ప్రాబల్యం 0.40 శాతం, తీసుకోనివారిలో 1.21 శాతం ఉందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా బారినపడిన బాధితుల్లో వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి వైరస్‌ సోకినా ప్రమాద తీవ్రత తక్కువగా ఉంటుందని తేల్చారు.

59 శాతం

59 శాతం

కరోనా లక్షణాలు కనిపించిన వారిలో వైరస్‌ను ఎదుర్కొనే సమర్థత 59 శాతం పెరిగినట్లు పరిశోధకులు కనుగొన్నారు. 254 పాజిటివ్‌ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్‌ చేపట్టగా వాటిలో ఎక్కువగా డెల్టా వేరియంట్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇక, వ్యాక్సిన్‌ తీసుకోని యువకుల్లో ఇన్‌ఫెక్షన్లు, హాస్పిటల్స్ లో చేరికలకూ ఉన్న సంబంధాన్ని అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. గతంలో వైరస్‌ సోకినవారికి డెల్టా వేరియంట్‌ తోడై మరోసారి వ్యాధిగ్రస్తులు అయ్యే ప్రమాదం ఉందని కనుగొన్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని తెలిపారు.

5,6 ఏళ్లు ప్రభావం..?

5,6 ఏళ్లు ప్రభావం..?

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

Recommended Video

Delta Variant Spreads From Nanjing to Beijing In China | Oneindia Telugu
ఫంగస్ బెడద..

ఫంగస్ బెడద..

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది.

English summary
vaccinated people thrice lower risk of coronavirus infection london imperial college scientists revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X