Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మళ్లీ భగ్గుమన్న వెనిజులా- భారీగా కాల్పులు..!!

వెనిజులా మళ్లీ తగులబడుతోంది. రాజధాని కారకాస్‌లో భారీగా బాంబు పేలుళ్లు సంభవిస్తోన్నాయి. తుపాకుల మోతలు మోగుతున్నాయి. అధ్యక్ష భవనం సమీపంలో భారీగా కాల్పులు చోటు చేసుకుంటోన్నాయి. అధ్యక్ష భవనం పరిసరాల్లో గగనతలంపై డ్రోన్లు సైతం తిరుగాడాయి. వాటిని భద్రత సిబ్బంది నేలకూల్చారు. నికోలస్ మదురోను అమెరికా బంధించడం, అనంతరం డెల్సీ రోడ్రిగేజ్.. వెనిజులా అధ్యక్షురాలిగా నియమితులైన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇవి మరింత ఉద్రిక్తతను పెంచాయి.

వెనిజులా కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో సెంట్రల్ కారకాస్‌లోని మిరాఫ్లోరెస్ అధ్యక్ష భవనం వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. అధ్యక్ష భవన సముదాయంపై గుర్తుతెలియని డ్రోన్‌లు ఎగురుతున్నాయని గుర్తించడంతో భద్రతా దళాలు వెంటనే వాటిని నేలకూల్చినట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి ఉందని, ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికార వర్గాలను ఉటంకిస్తూ కథనాలు ప్రచురించాయి.

Venezuela s Presidential Palace Hit by Heavy Gunfire Drones and Aircraft Heard Over Caracas

అంతకుముందే డెల్సీ రోడ్రిగెజ్ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయగా.. కొద్ది గంటల వ్యవధిలోనే ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఆమె మదురోకు బహిరంగంగా మద్దతు పలికారు. అమెరికా చర్యను తిప్పికొట్టే ఉద్దేశం లేదనే పరోక్షంగా వెల్లడించారు. మదురోను తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రక్రియలు, అంతర్జాతీయ వేదికలను వినియోగించుకుంటామని తెలిపారు.

అధ్యక్ష భవనం సమీప ప్రాంతాలతో సహా కారకాస్ సిటీ అంతటా సుమారు 45 నిమిషాల పాటు భారీ కాల్పులు వినిపించాయి. కొన్ని చోట్ల విమానాలు అతి తక్కువ ఎత్తులో ఎగిరినట్లు స్థానికులు వెల్లడించారు. దీనిపై అధికార వర్గాల నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. అధ్యక్ష భవనం, ఇతర ప్రాంతాల్లో కాల్పులు మొదలైన మరుక్షణమే నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కరాకస్ సిటీ మొత్తాన్ని కూడా చీకట్లు కమ్ముకున్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

పలు ప్రాంతాల్లో సైరన్ మోతలు వినిపించాయి. కాల్పులు చోటు చేసుకోవడం, అంధకారం నెలకొనడానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా వెనిజులాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. దీనికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరావట్లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+