కరోనాకు విరుగుడు "వయాగ్రా".. మృత్యువు నుంచి బయటపడిన నర్సు.. ఫలించిన వైద్యుల ప్రయోగం
మహమ్మారి కరోనా సోకి మృత్యువుతో పోరాడుతున్న ఓ మహిళకు "వయగ్రా " దివ్య ఔషధంగా మారింది. కోమాలోకి వెళ్లిన ఆమెకు వైద్యులు ప్రయోగాత్మకంగా వయగ్రా మందును ఇచ్చారు. దాంతో కేవలం 48 గంటల్లోనే ఆమె ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చింది. మృత్యువుతో పోరాడుతూ కోమాలోకి వెళ్లిన ఆమె కోలుకుంది. ఎవ్వరూ ఊహించని విధంగా ప్రాణాల నుంచి బయటపడింది.

కరోనాతో మరణం అంచుల దాక ..
బ్రిటన్‌లోని లికోన్‌షైర్‌కు చెందిన నర్సు మోనికా అల్మెడాకు కరోనా సోకింది. దాంతో ఆమెను నవంబర్ 9న ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. పరిస్థితి మరింత దిగజారడంతో ఆమెను ఐసీయూకి తరలించి డాక్టర్లు చికిత్స అందించడం ప్రారంభించారు. నవంబర్ 16న మోనికా అల్మెడా కోమాలోకి వెళ్లింది. వైద్యులు ఎన్ని రకాలుగా చికిత్స అందించినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక మరణం తప్పదని వెంటిలేటర్‌ను తొలగించేందుకు సిద్ధమయ్యారు.

ప్రయోగాత్మకంగా 'వయగ్రా ' మందు
చివరి ప్రయత్నంగా మెనికా అల్మెడాపై వైద్యులు ప్రయోగాత్మకంగా వయగ్రా మందు ప్రయోగించారు. శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు వాడే ఈ వయగ్రా ను ఆమెకు అధికమొత్తంలో ఇచ్చారు. దీంతో ఊపిరితిత్తులు తెరుకుని శరీరం మొత్తానికి రక్త ప్రసరణ మెరుగుపడింది. రెండు రోజుల్లోనే ఆమె ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చింది. డిసెంబర్ 14న కోమా నుంచి బయటకు వచ్చింది. పూర్తి కోలుకున్న మెనికా అల్మెడా ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది.
Recommended Video

'వయాగ్రా' ఆమె పాలిట సంజీవిని
శృంగార సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వాడే వయాగ్రా మందు ఆమె పాలిట సంజీవనిగా మారడంపై వైద్యులు సహితం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ స్థాయులు పెరిగేందుకు దోహదపడే నైట్రిక్ ఆక్సైడ్ మాదిరిగానే వయాగ్రా కూడా పనిచేసిందని పేర్కొన్నారు. దీనిపై పరిశోధనలు చేస్తే బాగుంటుందన్నారు. మరణం అంచులదాక వెళ్లిన తనను వయాగ్రా మందు ప్రాణాలు కాపాడిందని తెలుసుకున్న నర్సు మోనికా అల్మెడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications