చనిపోయి మళ్లీ బతికొచ్చింది.. ఆమె గుండె ఏకంగా 17 నిమిషాలు ఆగిపోయింది..
చావు చివరిదాకా వెళ్లి వచ్చిన వారిని మృత్యుంజయులు అంటారు. కానీ ఓ మహిళ గుండె ఏకంగా 17 నిమిషాల పాటు ఆగిపోయింది. కానీ ఆమె చావు నుంచి బతికొచ్చింది. ఇదో మెడికల్ అద్భుతంగా అభివర్ణిస్తున్నారు. గ్లోసెస్టర్ కు చెందిన జిమ్ కోచ్ విక్టోరియా థామస్.. జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తుండగా కుప్పకూలిపోయారు. ఆ సమయంలో ఆమె గుండె పని చేయడం ఆగిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని బ్రిస్టల్ రాయల్ ఇన్‌ఫర్మరీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె కోమాలోకి వెళ్లిపోయింది.
అయితే విక్టోరియాకు డానోన్ డిసీజ్ అనే అరుదైన సిండ్రోమ్ బారిన పడినట్లు తేలింది. ఇదొక జెనెటిక్ డిజార్డర్ గా వైద్యులు అభివర్ణించారు. ఎట్టకేలకు 17 నిమిషాల తర్వాత ఆమె గుండె పనిచేయడం ప్రారంభించింది. అదే ఆస్పత్రిలో మూడు రోజుల పాటు కోమాలో ఉంది విక్టోరియా. అనంతరం డాక్టర్లు ఆమె శరీరంలో డీ ఫిబ్రిలేటర్ అనే ఒక చిన్న పరికరాన్ని అమర్చారు. మళ్లీ ఎప్పుడైనా గుండె ఆగితే, అది షాక్ ఇచ్చి తిరిగి గుండె స్పందనను పునరుద్ధరించేలా చేయడానికి ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు.

అయితే విక్టోరియా 2021లో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆమె గుండె పలుమార్లు ఆగిపోయింది. అయితే ఆమెను పేస్ మేకర్ పరికరం సాయంతో వైద్యులు రక్షించారు. గర్భధారణ సమయంలో ఆమెకు ఒక అరుదైన జన్యుపరమైన వ్యాధి డానోన్ డిసీజ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇది గుండెను బలహీనపరిచే వ్యాధిగా వైద్యులు గుర్తించారు. అయితే తాజాగా ఆమె గుండె మరోసారి ఆగిపోయింది. ఈ సారి ఏకంగా 17 నిమిషాల తర్వాత గుండె కొట్టుకుంది.












Click it and Unblock the Notifications