షాకింగ్ వీడియో: పులి ఎన్‌క్లోజర్‌లో దూకిన మహిళ!
టొరంటో: ఓ మహిళ చేసిన సాహసం ఆమెతోపాటు అక్కడున్న వారిని భయాందోళనలకు గురిచేసింది. కెనడాలోని ఓ జూలో ఒక్కసారిగా ఓ మహిళ పులి ఎన్‌క్లోజర్‌లో దూకింది. దీంతో అందరూ నిశ్చేష్టులయ్యారు.
ఈ దిగ్భ్రాంతికర ఘటన ఏప్రిల్ 16న కెనడాలోని టొరంటోలో జూలో చోటు చేసుకుంది. సుమంత్రన్ టైగర్ ఎన్‌క్లోజర్‌లో ఆ మహిళ దూకడంతో అక్కడున్న పర్యాటకులు షాక్‌కు గురయ్యారు.
ఆమె తన హాట్(టోపీ) కిందపడటంతో దాన్ని తీసుకునేందుకు ఏకంగా పులి బోనులోకే వెళ్లిందన్నమాట ఈ మహిళ. అయితే, పులికి అడ్డంగా మరో ఫెన్సింగ్ ఉండటంతో ఆమె బతికి బయటపడింది.

లేదంటే ఆ మహిళ పులికి ఆహారంగా అయిపోయుండేది. మహిళ ఎన్‌క్లోజర్‌లో దూకడంతోనే తనకేదో ఆహారం దొరికిందనుకున్న పులి అటు ఇటు ఆమెతోపాటు తిరిగింది. వెంటనే మహిళ అక్కడ్నుంచి బయటపడటంతో అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, సదరు మహిళను జూ అధికారులు తీవ్రంగా మందలించారు. ప్రమాదమని తెలిసినా ఇలాంటి పనులు చేయమేంటని మండిపడ్డారు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
2014, సెప్టెంబర్‌లో మన దేశ రాజధాని ఢిల్లీలో ఓ 20ఏళ్ల యువకుడు జూలోని పులి ముందు దూకి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications