Air Canada: విమానంలో మంటలు.. వైరల్ అయిన వీడియో..

టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ఎయిర్ కెనడా బోయింగ్ ఫ్లైట్ AC872 విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. జూన్ 5 సాయంత్రం ఈ ఘోర ప్రమాదం జరిగింది. పారిస్‌కు వెళ్లే విమానం రన్‌వేపై నుంచి
టేకాఫ్ అయిన ముప్పై నిమిషాలకే ఈ ఘటన జరిగింది. ఫ్లైట్ ట్రాకర్ ఫ్లైట్అవేర్ నివేదించిన ప్రకారం.. విమానం రాత్రి 8:46 గంటలకు దాని గేట్ నుంచి బయలుదేరింది. అయితే తిరిగి సర్కిల్ చేసి టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో రాత్రి 9:50 గంటలకు ల్యాండ్ చేయాల్సి వచ్చింది.

వైరల్ అవుతున్న వీడియోలో కుడి ఇంజిన్ నుంచి మంటలు వస్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత ఒక చిన్న పేలుడు శబ్దం కూడా వినిపించింది. దీంతో పైలట్ అత్యవసర ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో 400 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. అందరు క్షేమంగా ఉన్నట్లు విమానయాన సంస్థ తెలిపింది. "ఈ రాత్రి తరువాత టొరంటో నుంచి బయలుదేరే మరొక విమానంలో ప్రయాణీకులకు వసతి కల్పిస్తారు" అని విమానయాన సంస్థ పేర్కొంది.

Viral Video An Air Canada flight caught fire

ఇంజిన్ కంప్రెసర్ సమస్య వల్లే మంటలు చెలరేగాయని ఎయిర్ కెనడా ప్రతినిధి తెలిపారు. "విమానం ల్యాండ్ అయిన తర్వాత, సాధారణ ఆపరేటింగ్ ప్రక్రియల ప్రకారం ఎయిర్‌పోర్ట్ రెస్పాన్స్ వెహికల్స్ ద్వారా దీనిని తనిఖీ చేశారు. అది గేట్‌కు స్వయంగా ట్యాక్సీ చేయబడింది" అని ప్రతినిధి CP24కి తెలిపారు. ఈ సంఘటనలో పాల్గొన్న బోయింగ్ 777-300ER ఎయిర్‌క్రాఫ్ట్ మార్చి 2008 నుంచి ఎయిర్ కెనడా ఫ్లీట్‌లో భాగంగా ఉంది. వీటిలో 19 విమానాలు ప్రస్తుతం యాక్టివ్ సర్వీస్‌లో ఉన్నాయి.

మే 27న భారతదేశంలోని ఢిల్లీకి వెళ్లే మరో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజన్ సమస్యను ఎదుర్కొని, దారి మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది.
బోయింగ్ 777-300ER దాని దృఢమైన డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. సంవత్సరాలుగా ఎయిర్ కెనడాకు బాగా సేవలు అందిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+