వైరల్ వీడియో: కొడుక్కి 15 మంది.. తండ్రికి 125 మంది భార్యలు..

సాధారణంగా ఈ రోజుల్లో ఒక మహిళను వివాహం చేసుకోవడమే కష్టంగా మారింది. మారుతున్న పరిస్థితుల ప్రకారం ప్రస్తుతం యువత పెళ్లంటేనే పారిపోతున్నారు. అయితే దక్షిణ ఆఫ్రికాలోని స్వాజిలాండ్ ప్రాంతానికి చెందిన ఎస్వాటిని దేశ రాజుకి ఏకంగా 15 మంది భార్యలు ఉన్నారు. ఎస్వాటిని రాజు ఎమ్ ఎస్వాటి-3 తన 15 మంది భార్యలు, 100 మంది సర్వెంట్లతో ఇటీవల యూఏఈ పర్యటన చేపట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఆఫ్రికన్ దేశాల్లో ఇప్పటికీ ప్రజాస్వామ్యం లేదని అక్కడి రాజులు సకల ఐశ్వర్యాలు కలిగి ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

ఎస్వాటిని రాజు ఎమ్ ఎస్వాటి-3 తన 15 మంది భార్యలు, 36 మంది పిల్లలు, 100 మంది సర్వెంట్లతో యూఏఈ పర్యటన చేపట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తన ప్రైవేట్ జెట్ లో అబుదాబి ఎయిర్ పోర్టులో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 1986 నుంచి ఆ దేశాన్ని నియంతలా పరిపాలిస్తున్న ఈ రాజు సంపద 1 బిలియన్ డాలర్లు దాటినట్లు స్పష్టం అవుతోంది. అయితే ఎస్వాటి-3 తండ్రి సోబుజా-2 కు ఏకంగా 125 మంది భార్యలు ఉండేవారట. ఎస్వాటిని దేశంలో దాదాపు 60 శాతం మంది ప్రజలు పేదరికంలో మగ్గుతుంటే రాజు ఫ్యామిలీ మాత్రం ప్రైవేట్ జెట్లలో తిరగడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన లైఫ్ స్టైల్ ను తప్పుబడుతున్నారు.

Viral Video Eswatini King s Lavish UAE Arrival with 15 Wives 30 Kids and 100 Servants Locks Down Abu Dhabi

ఎస్వాటిని దేశ ప్రజలు విద్యుత్, నీటి సరఫరా తో ఇబ్బందులు పడుతుంటే ఆ దేశ రాజు మాత్రం ఇలా విదేశీ పర్యటనలు చేయడం సరైన విధానం కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఎస్వాటిని దేశాన్ని ఎమ్ ఎస్వాటి-3 1986 నుంచి పరిపాలిస్తున్నారు. అక్కడ విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. ప్రభుత్వాసుపత్రుల్లో మెడిసిన్ కొరత ఉంది. నిరుద్యోగం 23 శాతం నుంచి 33 శాతానికి పెరిగింది. దేశంలోని నిర్మాణ, టూరిజం, అగ్రికల్చర్, టెలీకమ్యూనికేషన్స్, ఫారెస్ట్రీ విభాగాల్లో ఆ దేశ రాజుకు అత్యధిక షేర్లు ఉన్నాయి. అక్కడి రాచరికపు సంప్రదాయం ప్రకారం రాజు.. ఏటా ఓ యువతిని భార్యగా స్వీకరిస్తాడు. అయితే ఈ ఆచారంపై ఏళ్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+