Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైరల్ వీడియో: పైకి లేచింది.. సెకన్లలో పేలిపోయింది!

Viral Video: వెనెజులాలోని టాచిరా రాష్ట్రంలో ఉన్న పారామిల్లో విమానాశ్రయంలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర విషాదం నెలకొంది. టేకాఫ్ అవుతున్న తేలికపాటి విమానం అదుపుతప్పి కుప్పకూలడంతో అందులో ఉన్న ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే మరణించారు.

స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 09:52 గంటల సమయంలో రెండు ఇంజిన్‌లు గల పైపర్ PA-31T1 (రిజిస్ట్రేషన్ YV 1443) విమానం బయలుదేరేందుకు ప్రయత్నించింది. రన్‌వే నుంచి పైకి లేచిన కొద్ది క్షణాలకే విమానం నియంత్రణ కోల్పోయింది. పైకి ఎగరడంలో విఫలమై, కొద్దిసేపటికే రన్‌వేపై బలంగా కూలి భారీ శబ్దంతో మంటల్లో పేలిపోయింది. టేకాఫ్ అయిన తర్వాత సెకన్ల వ్యవధిలోనే ఈ భయంకరమైన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video Light Aircraft Crashes Seconds After Takeoff at Paramillo Airport Venezuela

టైరు పేలుడే కారణమా?
ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అత్యవసర సేవా బృందాలు, అగ్నిమాపక దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్ ఈ ప్రమాదాన్ని ధ్రువీకరించింది. వెనిజులా నిబంధనల ప్రకారం.. విమాన ప్రమాదాల దర్యాప్తు మండలిని ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టేందుకు నియమించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఏరోనాటిక్స్ ప్రకటించింది. ప్రారంభంలో లభించిన ఫుటేజీలను పరిశీలించగా.. విమానం కొద్దిగా ఎత్తుకు ఎగిరిన తర్వాత అదుపు తప్పి కూలిపోవడం స్పష్టంగా కనిపించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం టైరు పేలడం వల్లే ఇది జరిగి ఉండవచ్చనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ.. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించడానికి దర్యాప్తు సంస్థల విచారణ ఇంకా కొనసాగుతోంది.

సామాజిక మాధ్యమాల్లో దృశ్యాలు వైరల్
ఈ భయంకర ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయం రన్‌వే నుంచి దట్టమైన పొగలు ఆకాశంలోకి ఎగిసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ జెట్ విమానం సాధారణంగా వెనిజులాలో అంతర్గతంగా ప్రయాణించడంతో పాటు ఇటీవల పనామా, క్యూబా వంటి దేశాలకు కూడా వెళ్లి వచ్చినట్లు Flightradar24 ట్రాకింగ్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+