Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Viral Video: డబుల్ డెక్కర్ బస్సును ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన రైలు.. 10 మంది మృతి

Viral Video: మెక్సికోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. మెక్సికో సిటీకి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటలకోముల్కో వద్ద ఓ రైలు క్రాసింగ్ వద్ద షాకింగ్ ఘటన చోటుచేసుకుంగది. ప్రయాణికులతో నిండిన ఓ డబుల్ డెక్కర్ బస్సును వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. దాదాపు 60 మందికి పైగా గాయాల పాలయ్యారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీలు ఈ భయంకరమైన ఘటనను కళ్లకు కట్టాయి. మరావటియో-అటలకోముల్కో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయిన సమయంలో బస్సు రైల్వే ట్రాక్‌కు దగ్గరగా నిలబడి ఉంది. రైలు రాకను గమనించిన బస్సు డ్రైవర్ రైలు వెళ్లేలోగా ట్రాక్‌ను దాటడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు బస్సు మధ్యభాగాన్ని బలంగా ఢీకొట్టింది. రైలు బస్సును చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్లడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో బస్సు పైభాగం పూర్తిగా విరిగిపోయింది.

Viral Video Train Collides with Bus in Mexico 10 Dead and 60 Injured

సహాయక చర్యలు ముమ్మరం
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అంబులెన్స్, సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల నుంచి గాయపడిన వారిని, మరణించిన వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మెక్సికో అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం, మరణించిన 10 మందిలో 7గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మరికొందరికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జ్ చేశారు.

మెక్సికోలో బస్సు ప్రమాదాలు సర్వసాధారణం. రవాణాకు బస్సులే ప్రధాన మార్గం కావడంతో ప్రజలు అధిక సంఖ్యలో వాటిపై ఆధారపడుతున్నారు. మెక్సికో ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2023లో ఫెడరల్ హైవేలపై మొత్తం 12,099 ప్రమాదాలు జరిగాయి. వీటివల్ల 100 మిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదాల్లో 1900 మంది మరణించగా, 6400 మంది గాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+