H-1B వీసా.. భారతీయుల అష్టకష్టాలు.. పెళ్లిళ్లు క్యాన్సిల్.. పేరెంట్స్ ఆవేదన
అమెరికాలో H-1B వీసా దరఖాస్తు ఫీజును పెంచుతూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పెళ్లి, దుర్గా పూజ, ఇతర అత్యవసర పనుల కోసం భారత్ కు వెళ్లాల్సి ఉన్నా వీసా ఫీజు రూ. 83 లక్షలకు పెంచడంతో వెనకడుగు వేస్తున్నారు. మరోవైపు H-1B వీసా దారుల వార్షిక రుసుము పెంచడంతో టెక్ సంస్థలు అప్రమత్తమయ్యాయి. 24 గంటల్లోగా అమెరికాకు తిరిగి రావాలని ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ మేరకు అమేజాన్, మైక్రోసాఫ్ట్ నుంచి మెయిల్స్ వస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు.
అమెరికాలో H-1B వీసా అప్లికేషన్ ఫీజు నిర్ణయంతో భారతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తమ సొంత పెళ్లి కోసం ఇండియాకు రావాల్సి ఉన్నా మళ్లీ వచ్చేందుకు రూ. 83 లక్షలు ఖర్చు చేయాల్సిన నేపథ్యంలో పెళ్లిళ్లను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికాలోని టెక్నాలజీ రంగం, అలాగే అమెరికా H-1B వీసాపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ, టెక్నాలజీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఓ యువతి ఆవేదన వ్యక్తం చేస్తూ రెడ్డిట్ లో పోస్టు చేసింది. తాను రాలేకపోతున్నానని తెలిసి తన తల్లి ఏడ్చిందని పేర్కొంది. కొన్నేళ్లుగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నానని.. తాజాగా వీసా పెంపు నిర్ణయంతో ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చినట్లు చెప్పుకొచ్చింది. అలాగే అమెరికా నుంచి భారత్ కు వచ్చిన వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సెప్టెంబర్ 21 రాత్రి వరకు తిరిగి ఆఫీసులకు చేరుకోవాలని పలు టెక్ కంపెనీలు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పలు కార్యక్రమాలు, పెళ్లిళ్లు అన్నింటినీ వదిలేసి అమెరికాకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని సామాజిక మాధ్యమాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు H-1B వీసా పెంపుపై వైట్ హౌజ్ సెక్రటరీ కరోలిన్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ఈ వీసాలు కలిగి ఉన్న వాళ్లు దేశం వెలుపల ఉంటే తిరిగి ప్రవేశించేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వారిపై కొత్త రూల్స్ ప్రభావం ఉండదని తెలిపారు. కొత్తగా వీసా తీసుకునేవారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని వివరించారు. ఇది వార్షిక ఫీజు కాదని.. మెత్తం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications