ఉక్రెయిన్‌పై పుతిన్ బ్రహ్మాస్త్రం- అణు క్షిపణి రెడీ: హిరోషిమాను మించిన విధ్వంసం-ఆందోళనలో

మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా సాగుతోన్న యుద్ధానికి బ్రేకులు పడట్లేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లో పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. రష్యా సాగిస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది.

పలు నగరాలపై..

పలు నగరాలపై..

ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని కీవ్‌ను చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు ఉక్రెయిన్. రాజధానిని కాపాడుకోవడంలో ఆ దేశ సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది.

పుతిన్ అసహనం..

పుతిన్ అసహనం..

ఈ పరిణామాలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్ర అసహనానికి, అసంతృప్తి గురి చేస్తోన్నట్లుగా కనిపిస్తోంది. రోజుల తరబడి యుద్ధం సాగుతోండటం, నాలుగైదు కీలక నగరాలపై ఆధిపత్యాన్ని చేజార్చుకోవడం, తరచూ యుద్ధంలో వెనుకడుగు వేస్తోండటం.. ఆయనను ఆగ్రహానికి గురి చేస్తోన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల కిందటే ఉక్రెయిన్ యుద్ధాన్ని పర్యవేక్షిస్తోన్న సైన్యాధికారిని కూడా మార్చారాయ.

విన్ దిస్ వార్..

విన్ దిస్ వార్..

ఈ నేపథ్యంలో- వ్లాదిమిర్ పుతిన్ మరిన్ని కఠిన నిర్ణయాలను తీసుకునే అవకాశం లేకపోలేదంటూ విదేశీ మీడియా అంచనా వేస్తోంది. అణు క్షిపణిని ప్రయోగించడానికీ పుతిన్ వెనుకాడే పరిస్థితులు లేవని చెబుతోంది. తమ ఆధీనంలో ఉన్న డొనాట్స్క్‌ను సైతం ఉక్రెయిన్ స్వాధీనం చేసుకునే దిశగా అడుగుల వేస్తోన్నందున పుతిన్- అణు క్షిపణిని ప్రయోగించడానికి మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేస్తోందక్కడి మీడియా. విన్ దిస్ వార్ అనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వివరించింది.

అణుక్షిపణి

అణుక్షిపణి

దీనికోసం అత్యంత శక్తిమంతమైన అణు క్షిపణిని పుతిన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 1939-1945 మధ్యకాలంలో జరిగిన రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా సైన్యం.. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై సంధించిన అణుబాంబు కంటే 12 రెట్లు శక్తిమంతమైన క్షిపణి ఇది. 1945 ఆగస్టు 6వ తేదీన బీ-29 బాంబర్ ద్వారా హిరోషిమాపై ఈ బాంబును జారవిడిచారు అమెరికా సైనికులు. ఈ దాడిలో 35 వేల మంది అక్కడికక్కడే మరణించారు. మరో 70 వేల మంది అణు ప్రభావానికి గురై నరకయాతన అనుభవిస్తూ మృతి చెందారు.

46 వేల టన్నుల బరువు

46 వేల టన్నుల బరువు

ఉక్రెయిన్‌పై ప్రయోగించడానికి రష్యా తాజాగా సిద్ధం చేస్తోన్నట్లుగా చెబుతోన్న ఈ అణు క్షిపణి బరువు 46,000 టన్నులు. దీని రేంజ్ 12,000 కిలోమీటర్లు. అమెరికా లేదా యూరపియన్ యూనియన్‌లో గల అన్ని దేశాలు ఈ క్షిపని పరిధిలోకి వస్తాయి. 12,000 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాన్ని ఇది ఛేదించగల ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది. దీని పేలోడ్ 500 కిలో టన్నులు. 500 కిలోల టన్నుల బరువును మోసుకెళ్లగలదు.

ఊహించని ఎదురు దెబ్బల నేపథ్యంలో..

ఊహించని ఎదురు దెబ్బల నేపథ్యంలో..

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా ఊహించని ఎదురుదెబ్బలను చవిచూసిన నేపథ్యంలో- పుతిన్ ఈ క్షిపణిపై దృష్టి సారించినట్లు కొమ్సొమోల్స్‌కాయా ప్రావ్దా అనే రష్యన్ టాబ్లాయిడ్ పేర్కొంది. రష్యా ప్రస్తుతం మొత్తం 5,977 న్యూక్లియర్ వార్‌హెడ్‌లను కలిగి ఉంది. ఇందులో 1,426 వార్‌హెడ్లను ఇప్పటివరకు వినియోగించింది. ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులు, వ్యూహాత్మక బాంబర్లు, అణుశక్తితో నడిచే జలాంతర్గాములు, హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనాలు వంటి అత్యాధునిక ఆయుధాలు రష్యా సొంతం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+