బెలారస్‌కు అణ్వాయుధాలు: పుతిన్ సంచలనం, జపాన్‌పై అమెరికా వేసిన వాటికంటే పవర్ఫుల్

మాస్కో: ఉక్రెయిన్‌తో దాడులు కొనసాగుతున్నవేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సంచలన ప్రకటన చేశారు. బెలారస్‌కు మొదటి బ్యాచ్ అణ్వాయుధాలను తరలించామని పుతిన్ తెలిపారు. వేసవి చివరి కల్లా మిగితా వాటిని కూడా తరలిస్తామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఎదురుదాడికి పాల్పడుతున్న క్రమంలో పుతిన్ చేసిన ఈ అణ్వాయుధాల ప్రకటన సంచలనంగా మారింది.

వ్యూహాత్మక అణ్వాయుధాలను బెలారస్‌కు తరలించడం జూన్ నెల చివరి నాటికి పూర్తవుతుందని పుతిన్ వెల్లడించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో ఆయన మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. రష్యా దేశ భూభాగానికి బెదిరింపులు వస్తే మాత్రమే అణ్వాయుధాలను ఉపయోగిస్తామని పుతిన్ స్పష్టం చేశారు. బెలారస్ రష్యాకు కీలకమైన మిత్ర దేశంగా ఉన్న విషయం తెలిసిందే.

Vladimir Putin

గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్రకు లాంచ్ ప్యాడ్‌గా బెలారస్ పనిచేయడం గమనార్హం. కాగా, టాక్టికల్ న్యూక్లియర్ ఆయుధాలను.. యుద్ధభూమిలో శత్రు దళాలను, వారి ఆయుధాలను నాశనం చేయడానికి ఉపయోగించనున్నారు. ఉక్రెయిన్‌లోని మొత్తం నగరాలను కూల్చివేసేందుకు ఈ క్షిపణులను ఉపయోగించే అవకాశం ఉందని రష్యా సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, తమ దేశానికి రష్యా నుంచి అణ్వాయుధాలైన క్షిపణులు, బాంబులు తరలించినట్లు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ ధృవీకరించారు. ఈ అణ్వాయుధాలను హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన బాంబుల కంటే మూడు రెట్లు అధిక శక్తివంతమైనవని తెలిపారు. ఇప్పటికే రష్యా దాడులతో ఉక్రెయిన్‌లోని చాలా నగరాలు దెబ్బతిన్నాయి. వేలాది మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

గత కొద్ది రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత నగరం క్రైవీ రిహ్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఓ ఐదంతస్తుల భవనం సమా పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 10 మంది ప్రాణాలు కోల్పోగా, 25 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పైనా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఆ నగరానికి రక్షణగా ఉన్న ఎయిర డిఫెన్స్ వ్యవస్థలు పలు క్షిపణులను కూల్చివేశాయని కీవ్ ప్రాంత మిలిటరీ రీజియన్ ప్రతినిధులు తెలిపారు. కీవ్ సహా పలు నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థ సైరన్ మోగుతూనే ఉంది. ఉక్రెయిన్ ఎదురుదాడులు జరుపుతున్నప్పటికీ.. రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు తమ దేశ భూభాగం జోలికి వస్తే అణ్వాయుధాల దాడి తప్పదని రష్యా హెచ్చరించడం ఆందోళనలకు గురిచేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+