ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ కారు యాక్సిడెంట్..!!

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్​ను ఓ కారు ఢీకొట్టింది. అయితే, ఎటువంటి ప్రమాదం లేదని జెలెన్​స్కీ ప్రతినిధి వెల్లడించారు. జెలెన్​స్కీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని..ఈ ఘటనలో అధ్యక్షుడు స్వల్పంగా గాయపడ్డట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనతో ఉన్న వైద్యులు జెలెన్​స్కీ తో పాటుగా కారు డ్రైవర్​కు చికిత్స అందించారు. జెలెన్​స్కీని అంబులెన్సులో తరలించామని..తీవ్ర గాయాలు కాలేదని అధికార వర్గాలు స్పష్టం చేసాయి.

ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ ప్రారంభమైనట్లు ప్రకటించారు. రష్యా - ఉక్రెయిన్ పైన యద్దం ప్రారంభమైన సమయం నుంచి జెలెన్ స్కీ ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు, రష్యా సేనల పైన ఈ మధ్య కాలంలో ఉక్రెయిన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. రష్యా అధీనంలోని 6,000 చదరపు కిలోమీటర్ల కంటే అధిక భూభాగాన్ని తమ దళాలు హస్తగతం చేసుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఇటీవల ప్రకటించారు. రష్యా సరిహద్దు వరకు ఉక్రెయిన్ దళాలు చొచ్చుకెళ్లాయని ఖర్కివ్ గవర్నర్ ఓలేహ్ సైనీహుబోవ్ తెలిపారు.

Volodymyr Zelensky car accident, president was not seriously injured

రష్యా దళాలు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఖర్కివ్​లోనే వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ దెబ్బకు రష్యా సేనలు తిరిగి వెళ్లిపోతున్నాయంటూ వార్తా కథనాలు వస్తున్నాయి. కీవ్ నుంచి దళాలు ఉపసంహరించుకున్న తర్వాత యుద్ధంలో మాస్కోకు జరిగిన ఘోర అవమానం ఇదేనంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక, ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త కలకలం రేపింది. అయితే, ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదని.. సురక్షితంగా ఉన్నారంటూ అధికార వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+