రష్యా అంతర్యుద్దం లో అనూహ్య మలుపు - వెనక్కి తగ్గిన వాగ్నర్ దళాలు, ఏం జరిగింది..!!
రష్యాలో కలకలం రేపిన సంక్షోభంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు పుతిన్ కు భారీ రిలీఫ్ లభించింది. అంతర్యుద్ధం దాకా వెళ్లిన పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. మాస్కోవైపు వేగంగా కదులుతూ వెళ్లిన వాగ్నర్ దళాలు హాఠాత్తుగా ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌తో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చర్చలు ఫలితం ఇచ్చాయి. దీంతో రక్తపాతం లేకుండానే సాయుధ తిరుగుబాటు ముగిసింది.
రష్యాలో ఒక్క సారిగా మొదలైన ఉద్రిక్త పరిస్థితులు అంతే వేగంగా మారిపోయాయి. నాటకీయ పరిణామల మధ్య రష్యాల నగరాల్లో వాగ్నర్ దళాల ప్రవేశంతో ఒక్క సారిగా ఆందోళన పెంచాయి. తిరుగుబాటు నేతగా నిలిచిన వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన తిరుగుబాటు జెండా ఎగురవేసింది. ఒక్కొక్క నగరాన్ని దాటుకుంటూ మాస్కోకు 200 కిలో మీటర్ల దూరం వరకు వెళ్లింది.

దీనిని తిప్పి కొట్టేందుకు పుతిన్ సైన్యం అదే స్థాయిలో సిద్దమైంది. భారీగా సైనిక వాహనాలు..బలగాలను మొహరించింది. దీంతో భారీగా రక్తపాతం తప్పదని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేసాయి. రష్యాలోని తమ పౌరులను పలు దేశాలు అప్రమత్తం చేసాయి. ఈ ఉద్రిక్తతలతో అధ్యక్షుడు పుతిన్ మాస్కోను వీడి బంకర్లలోకి వెళ్లినట్లు ప్రచారం జరిగింది.
ఈ సమయంలో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ముందుకు వచ్చారు. రష్యా ప్రభుత్వం..వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ మధ్య సంధి కుదిర్చే ప్రయత్నాలు చేసారు. ఉద్రిక్తతను సడించేలా ఫార్ములా ప్రతిపాదించారు.బలగాలను నిలువరించాలని కోరారు. దీని పైన ప్రిగోజిన్ కూడా టెలిగ్రాం ద్వారా తన సందేశాన్ని వినిపించారు.

రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాల నిలువరింతకు అంగీకరించగామన్నారు. తిరిగి తమతమ స్థానాల్లోకి వెళ్లిపోతున్నామని ప్రకటించారు. ప్రిగోజిన్ పై క్రిమినల్ కేసు ఎత్తివేస్తున్నట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. దీంతో ప్రిగోజిన్ వెంట నడిచిన సభ్యుల పైనా కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటనలో స్పష్టం చేసింది.
వాగ్నర్ దళానికి భద్రతాపరమైన హామీలు ఇవ్వటం ద్వారా సంధి సాధ్యమైంది. తమ దళాలను ఉప సంహరించుకుంటున్నట్లుగా ప్రిగోజిన్ స్పష్టమైన ప్రకటన చేసారు. ఉక్రెయిన్ లోని తమ శిబిరాలకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా వెంటనే ప్రిగోజిన్ పై కేసు ఎత్తివేయటం..తిరుగుబాటుకు ప్రయత్నించిన వారి పైన విచారణ ఉండదనే హామీతో మొత్తం వ్యవహారం సద్దుమణిగింది. దీంతో రష్యాలో తిరుగుబాటు ఎపిసోడ్ రాజీ ఒప్పందాలతో ముగిసిసోయింది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications