గ్రీన్ కార్డుల జారీపై గరిష్ట పరిమితి ఎత్తివేత..! భారత్ కు శుభవార్త చెప్పిన అమెరికా..!!
వాషింగ్టన్/హైదరాబాద్ : ఇటీవల అమెరికా నుండీ అన్నీ బ్యాడ్ న్యూస్ లే వింటున్న భారత్ కు అగ్రరాజ్యం తాజాగా ఒక పెద్ద గుడ్ న్యూస్ వినిపించింది. గ్రీన్ కార్డుల విషయంలో మనకు, చైనాకు అనుకూలంగా ఉండే నిర్ణయానికి మద్దతు తెలిపింది. విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేస్తూ శాశ్వతంగా స్థిరపడటానికి ఉద్దేశించిన 'గ్రీన్ కార్డు'ల జారీపై గరిష్ట పరిమితిని ఎత్తివేసింది.
అంటే అమెరికాలో ఉద్యోగం వస్తే... భారతీయులు ఉంటారో లేదో అన్న సంశయం ఇక అక్కర్లేదు. అంత కంటే ముందే ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న భారతీయులకు ఇది నమ్మలేని గుడ్ న్యూస్. ఇంతవరకు ఒక్కో దేశానికి గరిష్టంగా 7 శాతం గ్రీన్ కార్డులు మాత్రమే జారీచేయాలన్న నిబంధనను ఎత్తివేయాలని అమెరికా సెనెట్ లో బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి సెనెట్ ఆమోదం కూడా తెలిపింది.

ఈ బిల్లు ప్రకారం ఇకపై ప్రతిభ ఆధారంగానే విదేశీయులకు గ్రీన్ కార్డులు జారీచేస్తారు. ప్రస్తుతం అమెరికాలో పెద్దసంఖ్యలో గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. పాత నిబంధన ప్రకారం భారతీయుల గ్రీన్ కార్డు దరఖాస్తులు ఆమోదం పొందాలంటే 70 ఏళ్లు పడుతుందని అంచనాలున్నాయి. తాజా బిల్లు ఆమోదంతో దరఖాస్తులు పెట్టుకున్న వారి కలలన్నీ నెరవేరనున్నాయి. పెద్ద సంఖ్యలో అమెరికాకు తరలిపోతున్న మన లాంటి దేశాలకు ఇది పెద్ద గుడ్ న్యూస్.
అంతేకాదు... ఇందులో మరో మంచి వార్త కూడా ఉంది. 'ఫ్యామిలీ స్పాన్సర్డ్' విభాగంలో కూడా కోటాను 15 శాతానికి పెంచాలని తాజా బిల్లులో ప్రతిపాదించారు. అమెరికాలోని సంస్థలు హెచ్-1బి వీసాల ద్వారానే విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసాలపై పనిచేసేవారిలో భారతీయులే అత్యధికం. తాజా అమెరికా నిర్ణయంతో భారతీయులు పెద్ద యెత్తున ఊపిరి పీల్చుకుంటున్నట్టు తెలుస్తోంది.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications