Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రష్యా-ఉక్రెయిన్ మధ్య చారిత్రక ఒప్పందం-యుద్ధం కన్నా ప్రజలే ముఖ్యమనే సంకేతం..

ఐదు నెలలుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ పై మొదలుపెట్టిన దండయాత్ర ఇంకాపూర్తి కాలేదు. దీని ప్రభావంతో నల్లసముద్రంలో ఆహార ధాన్యాల రవాణా నిలిచిపోయింది. చివరికి ఇది ఇరుదేశాల్లో ప్రజల పాలిట శాపంగా మారిపోతోంది. దీంతో ఇరుదేశాలు కాస్త వెనక్కి తగ్గాయి. ఇవాళ ఐరాస సమక్షంలో కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి.

నల్లసముద్రంలో ధాన్యం డెలివరీలు ఆగిపోవడం, నెలల తరబడి సాగుతున్న చర్చలను ముగించడం, రష్యా దండయాత్రకు ముందు చివరిగా కనిపించిన స్థాయికి గోధుమల ధరలను తీసుకురావడమే లక్ష్యంగా ఉక్రెయిన్, రష్యా ఒక మైలురాయి ఒప్పందంపై సంతకం చేశాయి. ఉక్రెయిన్ పై ఫిబ్రవరిలో దాడి మొదలైన తర్వాత పోరాడుతున్న పార్టీల మధ్య ఇదే మొదటి ప్రధాన ఒప్పందం. యుద్ధం కారణంగా అదనంగా 47 మిలియన్ల మంది ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ నేపథ్యంలో జనం తీవ్రమైన ఆకలిని తీర్చేందుకు ఈ ఒప్పందం సహాయపడుతుంది.

warring countries Russia-Ukraine seal landmark grain deal to ease shortages

వాస్తవానికి రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేసేందుకు, తమ జెండాల్ని పంచుకునేందుకు నిరాకరించాయి. దీంతో ఒప్పందంపై సంతకాల ప్రక్రియ ఆలస్యమైంది. అయితే ఐరాస జోక్యం చేసుకుని ఇరు దేశాల నేతల్ని ఒప్పించింది. దీంతో ఈ చారిత్రక ఒప్పందంపై వారు సంతకాలు చేశారు. ఇస్తాంబుల్‌లోని విలాసవంతమైన డోల్మాబాస్ ప్యాలెస్‌లో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సమక్షంలో ఇరుపక్షాలు చివరికి విడివిడిగా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+