వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: వామ్మో.. ఇదెక్కడి వీడియోరా నాయనా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..

|
Google Oneindia TeluguNews

ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. మేఘంలోని నీరంతా ఒక్కసారిగా నేలను తాకిందా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. ఓ ప్రాంతంలో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు కమ్ముకొచ్చాయి. తర్వాత ఏముంది వర్షం పడుతుందని అనుకుంటారు అంతా. అది నిజమే.. కానీ ఇది మామూలు వర్షం కాదు. ఒక్కసారిగా మేఘం పగిలిపోయి నీరు నేలను చేరినట్లు మహా కుండపోత వర్షం.. అది కూడా సెకండ్లలో కురిసింది.

క్లౌడ్‌బర్స్ట్
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను వండర్‌ ఆఫ్‌ సైన్స్‌ అనే ట్విట్టర్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. పీటర్‌ మేయర్‌ అనే ఫొటో గ్రాఫర్‌ ఈ వీడియోను చిత్రీకరించినట్లు తెలిసింది. ఇలాంటి వాటిని క్లౌడ్‌బర్స్ట్ అంటారని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మేఘాలు పేలిన సంఘటనలు భారీ ప్రాణ, ఆస్తి నష్టానికి దారితీశాయని గుర్తు చేశారు. పర్వత ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్‌లలో ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందనన్నారు.

WATCH: Amazing video of cloudburst going viral on social media

ఆస్ట్రీలియాలో ఘటన
ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదూ.. ఈ ఘటన ఆస్ట్రీలియాలోని మిల్ల్‌స్టట్‌ అనే సరస్సు వద్ద రెండు పర్వతాల మధ్య జరిగింది. నల్లటి మబ్బులతో వేగంగా కదులుతూ మేఘాల నీరు ఒక్కసారిగా కుంభవృష్టిగా కురిసింది.

English summary
The phenomenon of cloudburst often brings great devastation. Wherever the cloud bursts, there is a flood of water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X