వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video:హవ్వా..ప్రారంభించే ముందే కూలిన వంతెన, ఎక్కడంటే.?

|
Google Oneindia TeluguNews

నాసిరకం నిర్మాణాలతో ప్రమాదమే.. ఎక్కడైనా నిర్మాణం జరిగితే.. ఓ నెల.. లేదంటే 2 నెలల తర్వాత రిపేర్ కావడమో.. పడిపోవడం జరుగుతుంది. కానీ అక్కడ రిబ్బన్ కటింగ్ చేసిన వెంటనే కూలింది. కాంగోలో జరిగిన ఘటన చర్చకు దారితీసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది.

పాత వంతెన కూల్చి

పాత వంతెన కూల్చి

కాంగోలో పాత వంతెనను అధికారులు కూల్చివేశారు. అక్కడ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. ప్రారంభించే లోపే కూలిపోయింది. రిబ్బన్ కట్ చేసిన మహిళా అధికారిని సెక్యూరిటీ సిబ్బందికి కాపాడారు. మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. అదీ పూర్తిగా కూలకముందే దాని నుంచి అందరూ దిగేశారు. ఆ తర్వాత రెండు ముక్కలై పడిపోయింది. ఈ విషయాన్ని స్థానికులు తెలియజేశారు.

 6.4 మిలియన్ వ్యూస్..

6.4 మిలియన్ వ్యూస్..


వాస్తవానికి ఈ ఘటన గత వారం జరిగింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే దీనిని 6.4 మిలియన్ల సార్లు చూశారు. తెగ లైకులు కొడుతున్నారు. నెటిజన్లు అధికారుల తీరును దుమ్మెత్తి పోస్తున్నారు. నాసిరకం పనులు జరిగితే ఇలా ఉంటుందని మండిపడుతున్నారు.

 ఇదీ నాణ్యత..?

ఇదీ నాణ్యత..?


నాణ్యత ఎలా ఉందో ఈజీగా తెలుస్తోందని నెటిజన్లు అంటున్నారు. అందుకే ప్రారంభం రోజునే.. దాని మీద అందరూ ఉండగానే కూలిపోయిందన్నారు. ప్రజా ధనాన్ని వృధా చేశారని దుమ్మెత్తి పోశారు. అప్పుడే కూలింది సరిపోయింది.. లేదంటే.. ఏ రాత్రో కూలితే సంగతి ఏంటీ అని అడుగుతున్నారు. దానికి మూల్యం ఎవరూ చెల్లిస్తారని నిలదీస్తున్నారు. పాలకులు చేసే పనులతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు. సమస్యలు పరిష్కారం అవడం లేదని అంటున్నారు.

English summary
bridge collapsed in the Democratic Republic of Congo on the day of its inauguration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X