viral video:చిన్నారికి హిందీ నేర్పిస్తూ.. పకోడి రుచికరంగా ఉందంటూ, వైరల్
మన జాతీయ భాష హిందీ.. దాంతో ఉర్ధూ, పంజాబీ కొన్ని పదాలు లింక్ ఉంటాయి. దాదాపు దేశవ్యాప్తంగా హిందీ అంతా మాట్లాడుతారు. మరీ విదేశాల్లో కూడా హిందీ, ఇంగ్లీష్, అరబ్బీ, ఫ్రెంచ్ ఉంటుంది. అయితే విదేశాల్లో హిందీ.. లేదంటే ఇతర భారతీయ భాషల గురించి తెలిస్తే మనం సంతోషం పడతాం. మరీ కొరియా మహిళ తన పిల్లాడికి హిందీ నేర్పిస్తే ఎలా ఉంటుంది.. ఆ వీడియో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. మీరు ఆ వీడియో చూడండి.

ఇండియన్ కొరియన్ కపుల్
ఇండియన్ కొరియన్ కపుల్ తన కుమారుడికి హిందీ నేర్పిస్తోంది. వీడియోను వారు ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రేమి కిమ్ ఫరేవర్ అనే ఫేజ్ మీద పోస్ట్ చేశారు. దానికి వారు కొరియన్ వైఫ్ టీచింగ్ హిందీ టు సన్ అని రాశారు. ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే 3.60 లక్షల సార్లు చూశారు. 20 వేల మంది లైకు చేశారు. వీడియోలో వివాహిత తన కుమారుడికి పకోడి ఇస్తోంది.. ఇచ్చి ఇవీ ఏమిటి అని అడగగా.. యే పకోడా హై అని అతను అంటాడు. అలా చిన్నారికి టీచింగ్ చేస్తోంది.
రుచికరంగా పకోడి
అలా చాలా సార్లు అంటారు. తర్వాత పకోడా బహుత్ స్వాద్ హై అని అంటుంది. ఇవీ చాలా రుచికరంగా ఉన్నాయని చెబుతుంది. చాలా మంది హృదయం ఆకారంలో ఎమోజీలు పెడుతున్నారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. లవ్ లీ అని ఒకరు.. మీరిద్దరు చాలా క్యూట్ అని మరొకరు కామెంట్ చేశారు. సో స్వీట్.. మీరిద్దరూ అనంతమైన ప్రేమను వ్యక్తం చేశారని కామెంట్ చేశారు.

ఫారినర్ ఛాయ్ అంటూ
నెలక్రితం ఓ ఫారినర్ కూడా చక్కగా హిందీ మాట్లాడుతూ ఛాయ్ విక్రయిస్తున్నాడు. ఆమె తన చేతిలో నాలుగు గ్లాసులు పట్టుకొని.. చాయ్ చాయ్ అని అంటారు. గరమ్ చాయ్.. మెమ్ సాబ్ గరమ్ చాయ్.. స్పెషల్ గరమ్ చాయ్.. మీకు కావాలా అని అంటారు. మీ కోసమే తయారు చేశానని చెబుతారు. ఆ వీడియోకు 4.95 లక్షల వ్యూస్ వచ్చాయి. 42 వేల మంది లైకులు కొట్టారు.












Click it and Unblock the Notifications