డెలివరీ బాయ్ కుక్క బుద్ధి: సగం నోటితేనే తినేసి.. మళ్లీ ప్యాక్ చేసి..(వీడియో)
Recommended Video

బీజింగ్: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు జాగ్రత్తగా తమకు వచ్చిన పార్సిళ్లను పరిశీలించుకునేలా చేశాడు ఈ చైనా డెలీవరీ బాయ్. ఎందుకంటే.. ఇతడు తాను డెలివరీ చేయాల్సిన పార్సిళ్లను సగం తినేసి.. మిగితా సగం ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్లకు ఇచ్చేస్తున్నాడితడు.

సీసీటీవీలో..
చైనా గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని సిహుయి నగరంలో డెలివరీ బాయ్ చేసిన నిర్వాకం సీసీటీవీలో రికార్డైంది. లిఫ్టులో వెళుతండగా ఆ డెలివరీ బాయ్ ఆహార పదార్థాలు తినడం స్పష్టంగా రికార్డైంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

నోటితోనే తినేశాడు..
ఆ వీడియోలో ఏముందంటే.. ప్లాస్టిక్ బాక్సును తెరిచిన డెలివరీ బాయ్.. చేతులకు అంటకుండా.. అందులోనే నోరు పెట్టి మరీ తినేశాడు. ఆ తర్వాత చక్కగా మళ్లీ మూత పెట్టేసి కవర్‌లో ప్యాక్ చేసేశాడు.

ఏమీ ఎరుగనట్లుగా ప్యాక్ చేసి..
ఇంకో బాక్సులో ఉన్న సూప్ కూడా అలాగే తెరిచి కొంచెం తాగి మళ్లీ మూత పెట్టి కవర్‌లో పెట్టాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లుగా ఎంచక్కా ఆ పార్సిల్‌ను ఆర్డర్ చేసిన వారికి ఇచ్చేందుకు వెళ్లిపోయాడు.
ఉద్యోగం ఊడింది.. జాగ్రత్త అంటూ..
ఆ డెలివరీ బాయ్‌ను చైనాలోని ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ మైచువన్‌కు చెందిన ఉద్యోగిగా గుర్తించారు. అయితే అతడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ వీడియో వైరల్ అవడంతో సదరు కంపెనీ అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించింది. కాగా, ఆ డెలివరీ బాయ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది వీక్షించగా, వేలాదిమంది షేర్లు చేశారు. ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.
-
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications