ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే నెట్వర్క్ ఉన్న దేశం ఇదే!
రైల్వే... ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశంలో ఉండే రవాణా వ్యవస్థపైన ఆధారపడి ఉంటుంది అనేది ఎటువంటి వివాదం లేని అంశం. ముఖ్యంగా రవాణా వ్యవస్థలో రైల్వే కీలకభూమిక పోషిస్తుంది. అటువంటి రైల్వే దేశమంతటా అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉంటే, దేశంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ ప్రజలకు ప్రయాణ సేవలను అందించడమే కాకుండా సరుకు రవాణాకు కూడా దోహదం చేస్తుంటే ఆ దేశం అన్ని రకాలుగా పురోభివృద్ధిని సాధిస్తుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ఉన్న దేశం
ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశంగా, ఆర్థికంగా బలంగా ఉన్న, అగ్రదేశంగా చెప్పుకునే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రైల్వే నెట్వర్క్ లో ప్రపంచంలోనే ముందు వరుసలో ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే నెట్వర్క్ ఉన్న దేశంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గుర్తించబడింది. అమెరికాలోని జనావాస ప్రాంతాలు మాత్రమే కాక కొండలు, గుట్టలు, నదులు వంటి అన్ని ప్రాంతాలను కలుపుతూ తన రైల్వే నెట్వర్క్ ను అమెరికా విస్తరించింది.

2లక్షల 20వేల కిలోమీటర్లు పొడవైన రైల్వే నెట్ వర్క్
ప్రపంచంలోనే అతి పొడవైన నెట్వర్క్ ను కలిగి ఉంది. అమెరికాలో రైలు మార్గాల పొడవు దాదాపు 2లక్షల 20వేల కిలోమీటర్లు గా ఉంది. అమెరికాలో రైల్వే వ్యవస్థ ప్రధానంగా సరుకు రవాణా కోసం వినియోగించబడుతుంది. దేశంలోని అన్ని మూలలకు ధాన్యం, బొగ్గు, చమురు, వాహనాలు, పారిశ్రామిక వస్తువులు మొదలైనవి రైల్వే మార్గాల ద్వారా రవాణా అవుతుంది.
అక్కడ ప్రైవేట్ కంపెనీల చేతిలో రైల్వే నెట్ వర్క్
యూనియన్ పసిఫిక్, బీఎన్ ఎస్ఎఫ్ రైల్వే, సి ఎస్ ఎఫ్ ట్రాన్స్పోర్టేషన్, నార్ ఫోక్ సదరన్ వంటి పెద్ద కంపెనీలు యూఎస్లో రైల్వే వ్యవస్థను నిర్వహిస్తాయి. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమికను పోషిస్తున్నాయి. యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ రైల్ రోడ్స్ అమెరికా రైలు నెట్వర్క్ రెండు లక్షల ఇరవై వేల కిలోమీటర్లు ఉందని వెల్లడించింది.
అమెరికా ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముకలా రైల్వే నెట్ వర్క్
అమెరికాలో ఉన్న ఈ అపారమైన నెట్వర్క్ ఓడరేవులను, నగరాలను, వ్యవసాయ భూములను, కర్మాగారాలను, చిన్న పట్టణాలను తీర ప్రాంతాలకు అనుసంధానం చేస్తుంది. ఇది అమెరికా ఆర్థిక అభివృద్ధికి చాలా బలమైన వ్యవస్థగా కనిపిస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా తన రైల్వే నెట్వర్క్ ను ఎక్కువగా ప్రైవేటు యాజమాన్యంలో ఉంచుతుంది.
19వ శతాబ్దంలోనే అమెరికా రైల్వే నెట్ వర్క్
. ముఖ్యంగా సరుకు రవాణా కోసం అమెరికా తీసుకున్న ఈ విధానం అమెరికా అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది. సరుకు రవాణాకు అమెరికా ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది. ఇక అమెరికా అభివృద్ధికి ప్రధాన కారణమైన రైల్వే నెట్ వర్క్ 19వ శతాబ్దంలోనే నిర్మాణం చెందింది. హైవేలు, విమానాలు రాక ముందే ఇక్కడ రైల్వే వ్యవస్థ ఉంది. అమెరికా రైలు నెట్ వర్క్ భూమిని ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు చుట్టి వచ్చేలా ఉంటుంది.
-
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
గురి చూసి భారత్ రావాల్సిన విమానంపై అమెరికా భారీ దాడి -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications