ఏం టైమింగ్ రా బాబు.. అనుకున్నది సాధించబోతున్నాడు?!

ప్రస్తుతం నోబెల్ బహుమతుల ప్రకటనల సందడి కొనసాగుతోంది. ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్ వంటి రంగాలకు సంబంధించిన నోబెల్ బహుమతులను గెలుచుకున్న సైంటిస్టుల పేర్లు వెల్లడయ్యాయి కూడా. సరిగ్గా అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. నోబెల్ శాాంతి బహుమతిపై కన్నేశారు. ఈ రేసులో నిలిచారు. వివిధ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడం, అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ఆశిస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య వైట్‌హౌస్ ఓ ఆసక్తికరమైన ట్వీట్ ను పోస్ట్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ ను 'ది పీస్ ప్రెసిడెంట్' గా అభివర్ణించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో దీనికి సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. 'ది పీస్ ప్రెసిడెంట్' అని రాసివున్న డొనాల్డ్ ట్రంప్ ఫొటో అది. గాజాలో కాల్పుల విరమణ మొదటి దశ సంబంధించిన ఒప్పందాలపై ఇజ్రాయెల్, హమాస్ సంతకాలు చేసిన వెంటనే ఈ ట్వీట్ వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

White House Calls US President Donald Trump The Peace President

ఈజిప్ట్‌ వేదికగా రోజుల తరబడి జరిగిన పరోక్ష చర్చల అనంతరం ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నోబెల్ శాంతి బహుమతి గెలుచుకునే అవకాశాల గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆ విషయం తనకు తెలియదని దాటవేశారు. మనం ఏడు యుద్ధాలు, అంతర్జాతీయ స్థాయి వివాదాలను పరిష్కరించామని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తనకు తెలియజేశాడని వ్యాఖ్యానించారు.

ఎనిమిదో వివాదం పరిష్కారానికి నోచుకోబోతోందని ఇజ్రాయెల్- హమాస్ శాంతి ఒప్పందం గురించి డొనాల్డ ట్రంప్ పరోక్షంగా ప్రస్తావించారు. ఈ రెండింటి మధ్య శాంతిని కుదర్చడానికి దగ్గరగా ఉన్నామని అన్నారు. రష్యా వివాదానికి కూడా పరిష్కారం దొరుకుతుందని అకుంటున్నట్లు తెలిపారు. చరిత్రలో ఇంత మంది నాయకులు ఇన్ని సమస్యలు పరిష్కరించి ఉండరని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.

ఇజ్రాయెల్-హమాస్, రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పడానికి ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలను ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. చాలా దేశాలు తనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినప్పటికీ, తన పేరును నోబెల్ కమిటీ పరిగణనలోకి తీసుకోకపోవట్లేదని, దీనికి ఏదో ఒక సాకు చెబుతారని అనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ తన అవకాశాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, వైట్‌హౌస్ ది పీస్ ప్రెసిడెంట్ అనే టైటిల్ లో ఈ ట్వీట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+