Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్ తరిమేయబోతున్న కోటీ 40 లక్షల మంది ఎవరు ? వీరంతా ఎక్కడున్నారు ?

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై గర్జిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనే అక్రమ వలసల్ని అరికడతానంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఇప్పుడు అమెరికాలో వారిని గుర్తించే పనిలో బిజీగా ఉన్నారు. ఇదంతా ముందే గమనించిన భారత్ తమ దేశానికి చెందిన 18 వేల మందిని వెనక్కి రప్పిస్తోంది. అయితే మరెంతో మంది భారతీయులతో పాటు ఇతర దేశాల జనం కూడా అక్రమంగా అమెరికాలో ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు అమెరికాలో వలసలు ఎలా పెరిగాయో ఓసారి చూద్దాం.

2007 నుంచి 2019 మధ్య పుష్కర కాలంలో అమెరికాలో వలసలు తక్కువగానే ఉండేవి. అయితే 2022కు వచ్చే సరికి మాత్రం అక్రమ వలసల జనాభా అమాంతం పెరిగి కోటీ 10 లక్షలకు చేరింది. 2024 నాటికి అది కాస్తా కోటీ 40 లక్షలకు చేరింది. దీంతో అమెరికాలో సక్రమంగా వలస వచ్చిన వారితో పాటు స్వతంగా అక్కడే జన్మించిన అమెరికన్లకు వీరు కంటగింపుగా మారిపోయారు. ఇదే అంశాన్ని రాజకీయంగా వాడుకుని ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చేసారు.

who are the 14 million immigrants trump wants to deport how they occupied US in past

అయితే అమెరికాలో అక్రమ వలసలకు ప్రధాన కారణం అక్కడ జరుగుతున్న అభివృద్ధి, జీవన విధానం, అలాగే సరిహద్దు చొరబాట్లు, అక్కడే ఉన్న వలసదారులకు లభిస్తున్న రక్షణలు. 2022 నుంచి 2023 మధ్య అమెరికాలో రికార్డు స్దాయిలో వలసలు జరిగాయని తెలుస్తోంది.2023 చివరి నాటికి 10 లక్షల శరణార్ధి దరఖాస్తులు అమెరికాలో పెండింగ్ లో ఉన్నాయి. అంతర్జాతీయ స్ధాయిలో అమెరికా అనుసరిస్తున్న సీహెచ్ఎన్వీ, ఉక్రెయిన్ విధానాల వల్ల దాదాపు 5 లక్షల మంది వచ్చి చేరారు.

అమెరికాలోని ఆరు రాష్ట్రాల్లో ఈ అక్రమ వలసల సంఖ్య ఎక్కువగా ఉంది. అదీ 2019 నుంచి 2022 మధ్యే ఎక్కువగా జరిగింది.
ఈ ఆరు రాష్ట్రాల్లో ఫ్లోరిడాలోనే 4 లక్షలు, టెక్సాస్ లో 85 వేలు, న్యూయార్క్ లో 70 వేలు, న్యూజెర్సీలో 55 వేలు, మస్సాచుసెట్స్ లో 50 వేలు, మేరీ ల్యాండ్ లో 40 వేల మంది వచ్చి చేరారు. కాల్నిఫోర్నియాలో మాత్రం లక్షా 20 వేల మంది తగ్గారు. అలాగే టెక్సాస్, ఫ్లోరిడా కంటే నెవెడాలో అత్యథిక శాతం కార్మికులు వలస వచ్చిన వారు ఉన్నారు. అమెరికాకు అత్యధిక శాతం వలసలు జరుగుతున్నవి మెక్సికో నుంచే. 2022లో 40 లక్షల మంది ఇక్కడ నుంచి వలస వచ్చారు. 2007లో అయితే మెక్సికో నుంచి ఏకంగా 69 లక్షల మంది వచ్చారు.

మెక్సికో తర్వాత భారత్ నుంచి అమెరికాకు ఎక్కువగా వలసలు ఉన్నాయి. కరేబియన్ దీవుల నుంచి 3 లక్షల మంది , యూరప్ దేశాల నుంచి 2.75 లక్షల మంది, ఆసియా సహా ఇతర ప్రాంతాల నుంచి 2019-22 మధ్య వలసల సంఖ్య బాగా పెరిగింది. ఇందులో ఎల్ సాల్వెడార్ నుంచి 7.5 లక్షల మంది రాగా.. భారత్ నుంచి 7.25 లక్షల మంది వచ్చారు. దీంతో 2022 నాటికి అమెరికాలో ఉన్న ఉద్యోగులు, కార్మికుల్లో ఏకంగా 83 లక్షల మంది వలసలు ఉన్నట్లు తేలింది. వీరు అమెరికాలోని ఉద్యోగుల్లో 8.3 శాతం. 6.3 మిలియన్ అమెరికా కుటుంబాలు 22 మిలియన్ల కంటే ఎక్కువ మంది అనధికార వలసదారుల్ని కలిగి ఉన్నాయి.86 శాతం కుటుంబాలు కనీసం ఒక అనధికార వలసదారుని లేదా జీవిత భాగస్వామిగా కలిగి ఉన్నాయి.
అలాగే 44 లక్షల మంది అమెరికాలో పుట్టిన పిల్లలే ఉన్నారు.

అమెరికాలో పుట్టిన 18 ఏళ్లలోపు 4.4 మిలియన్ల మంది పిల్లలు కనీసం ఒక అనధికార వలస తల్లీ తేదా తండ్రితో కలిసి నివసించారు. అయితే 18 ఏళ్లలోపు 8.5 లక్షల మంది పిల్లలు అనధికార వలసదారులు. అనధికార వలసదారులతో ఉన్న కుటుంబాల వాటా నెవాడా (9 శాతం) మరియు కాలిఫోర్నియా (8 శాతం ) వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంది. మైనే మరియు మోంటానా (1 శాతం కంటే తక్కువ) వంటి రాష్ట్రాల్లో అత్యల్పంగా ఉంది. దీంతో పాటు చట్టబద్ధమైన వలస జనాభా కూడా పెరిగింది. 2022లో 36.9 మిలియన్లకు ఇది చేరింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+