గబ్బిలాల వల్లే కరోనా వైరస్- డబ్ల్యూహెచ్‌వో-చైనా షాకింగ్ రిపోర్ట్-వుహాన్ కథ ఫేక్
ప్రపంచదేశాల్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ పుట్టుక చైనాలోనే జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ చైనాలో అసలు ఈ వైరస్ ఎలా పుట్టింది, ఎలా బయటికి వచ్చిందన్న దానిపై మాత్రం రకరకాల పుకార్లు, ఊహాగానాలు సాగాయి. వుహాన్ ల్యాబ్‌లో ప్రయోగాల సందర్భంగా ఈ వైరస్ బయటపడిందని అంతర్జాతీయంగా ఓ ప్రచారం బలంగా సాగింది. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్వో) చైనాతో కలిసి చేసిన ఉమ్మడి అధ్యయనంలో మాత్రం అది నిజం కాదని తేలింది. మరి అసలు నిజమేంటి ?
Recommended Video

కరోనా పుట్టుకపై డబ్ల్యూహెచ్‌వో-చైనా అధ్యయనం
2019 చివర్లో మొదలై అంతర్జాతీయంగా పలు దేశాలను పట్టి కుదిపేస్తున్న కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందంటే చైనా అని సులువుగానే సమాధానం చెబుతాం. కానీ చైనాలో ఎక్కడ పుట్టిందంటే మాత్రం భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవాలను నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ డబ్ల్యూహెచ్వో చైనాతో కలిసి ఓ ఉమ్మడి అధ్యయనం చేపట్టింది. చైనాలో క్షేత్రస్ధాయిలో పర్యటించిన ఉమ్మడి బృందం అక్కడి స్ధానికుల నుంచి, డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది నుంచి కరోనా వైరస్ మూలాలపై సమాచారం సేకరించింది. అక్కడ లభించిన ఆధారాలతో తాజాగా ఓ ఉమ్మడి నివేదికను విడుదల చేసింది.

కరోనా మూలాలపై షాకింగ్ రిపోర్ట్
కరోనా మూలాలు కనుగొనేందుకు రంగంలోకి దిగిన డబ్ల్యూహెచ్‌వో-చైనా ఉమ్మడి బృందం పరిశీలనలో పలు సంచలన అంశాలు లభించాయి. కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి ప్రచారంలో ఉన్న పలు ఊహాగానాలకు చెక్ పెట్టే అంశాలు వెలుగుచూశాయి. వీటిని క్షేత్రస్ధాయిలో పరిస్ధితులతో సరిపోల్చిన తర్వాత డబ్ల్యూహెచ్‌వో-చైనా ఉమ్మడి బృందం ఓ నివేదికను రూపొందించింది. ఇందులో పొందుపరిచిన పలు అంశాలు షాకింగ్‌గా ఉన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ రిపోర్ట్ చేసింది.

గబ్బిలాల నుంచి ఇతర జంతువుల ద్వారా మనుషుల్లోకి
డబ్ల్యూహెచ్‌వో-చైనా బృందాల ఉమ్మడి అధ్యయనంలో కరోనా వైరస్ మూలాలు గబ్బిలాల్లోనే ఉన్నట్లు గుర్తించారు. చైనాలో ఎక్కువగా తినే గబ్బిలాల ద్వారా మనుషుల్లోకి కొన్నిసార్లు, గబ్బిలాల నుంచి ఇతర జంతువుల ద్వారా మనుషుల్లోకి మరికొన్నిసార్లు ఈ వైరస్ ప్రైవేశించి ఉండొచ్చని ఈ ఉమ్మడి అధ్యయనం తేల్చింది. గబ్బిలాల్లో ఉన్న వైరస్ ఇతర జంతువులు వాటిని తిన్నప్పుడు వాటికి చేరి అక్కడి నుంచి మనుషుల్లోకి ప్రవేశించినట్లు తుది నివేదిక పేర్కొంది.

వూహాన్ ల్యాబ్ మూలాలు కట్టుకధే
గతంలో చైనాలో పుట్టిన కరోనా వైరస్ మూలాలు వుహాన్ ల్యాబ్‌లో ఉన్నట్లు అంతా భావించారు. స్ధానికంగా ఉన్న ఓ నాన్‌వెజ్ మార్కెట్ నుంచి ఈ వైరస్ తొలుత ఓ మహిళకు సోకిందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇవన్నీ కట్టుకథలే అని తాజాగా డబ్లూహెచ్‌వో-చైనా ఉమ్మడి అధ్యయనంలో తేల్చినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఇదే నివేదికలో వుహాన్ ల్యాబ్ మినహా కరోనా వైరస్ పుట్టుకకు కారణమని భావిస్తున్న మిగతా అంశాలపై తదుపరి అధ్యయనం అవసరమని కూడా తేల్చారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications