ట్రంప్ వి ఉత్తుత్తి బెదిరింపులేనా ? ఇరాన్ పై దాడి అసాధ్యమేనా..!
గతేడాది ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య రెండు వారాల పాటు యుద్దం సాగింది. ఇందులో ఇజ్రాయెల్ కు మద్దతుగా బరిలోకి దిగిన అమెరికా చేతులు కాల్చుకుంది. దీనికి ప్రధాన కారణం గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా మిత్రదేశాలు సైతం ఇరాన్ పై దాడికి ట్రంప్ కు సహకరించకపోవడమే. దీంతో ఇజ్రాయెల్ -అమెరికా ఇద్దరూ కాల్పుల విరమణ పేరుతో తోకముడచాల్సిన పరిస్ధితి ఎదురైంది. దీంతో ఇరాన్ పై అంతర్గత కలహాలు రేపి మళ్లీ దాడికి దిగాలని ట్రంప్ భావించారు.
ఇందులో భాగంగా తాజాగా ఇరాన్ లో ఉన్న ఖమేనీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు ప్రారంభమయ్యాయి. ఎప్పుడో దశాబ్దాల క్రితం ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవం నేపథ్యంలో దేశాన్ని వీడి అజ్ఠాతంలో ఉంటున్న షాల వారసుడు పహ్లావీ తెరపైకి రావడమే కాకుండా నిరసనకారుల్ని ఎగదోయడం ప్రారంభించారు. ఇదే అదనుగా ట్రంప్ కూడా రంగంలోకి దిగి ఇరాన్ పై దాడి చేస్తామంటూ బెదిరించడం మొదలుపెట్టారు.

ఓవైపు నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న ఖమేనీ ప్రభుత్వానికి కూలదోస్తామంటూ ట్రంప్ రోజూ బెదిరిస్తున్నారు. తాజాగా వెనెజులా అధ్యక్షుడు మదురోను వారి స్వదేశంలోనే అరెస్టు చేసి ఎత్తుకొచ్చిన ఊపులో ఉన్న ట్రంప్ అదే క్రమంలో ఇరాన్ లోనూ అలాంటి పరిణామాన్ని రిపీట్ చేస్తారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఇరాన్ పై అమెరికా దాడికి దిగుతుందా లేదా అన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే గల్ఫ్ జలాల్లో అమెరికా ఎలాంటి యుద్ధ నౌకలూ మోహరించలేదు.

ఇరాన్ పై దాడి చేసి ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని వెనెజులా అధ్యక్షుడు తరహాలో ఎత్తుకు రావాలంటే మధ్యప్రాచ్యంలోని అమెరికా, మిత్రదేశాల వైమానిక స్థావరాల నుంచి జరగాలి. అంటే ఖతార్, బహ్రెయిన్, ఇరాక్, యూఏఈ, ఒమన్ , సౌదీ అరేబియా, సైప్రస్‌లోని యూకేకు చెందిన అక్రోటిరి స్థావరం నుంచి ఈ పని జరగాలి. అంతే కాదు ఆయా దేశాల్ని ఇరాన్ ప్రతీకార దాడుల్ని కూడా అమెరికానే రక్షించాల్సి ఉంటుంది. రెండో ప్రత్యామ్నాయంగా గతేడాది ఇరాన్ భూగర్భ అణు కేంద్రమైన ఫోర్డోపై నిర్వహించిన లాంగ్-రేంజ్ బీ2 బాంబు దాడి లాంటిది చేయాలి. కానీ పట్టణ జనాభా ఎక్కువగా ఉన్న ప్రదేశంపై అలాంటి దాడి బూమరాంగ్ కావచ్చని అంచనా. చివరిగా అమెరికా ఇరాన్ పై దాడికి దిగితే ఖమేనీ ప్రభుత్వానికి స్వదేశంలో మద్దతు పెరిగి, నిరసనకారులకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇలా ఎలా చూసినా అమెరికా దాడి ట్రంప్ కే నష్టంగా మారే ప్రమాదం ఉంది.
-
అల్లం టీ Vs లెమన్ టీ..ఎవరికి ఏది మేలు చేస్తుంది..!! -
ఖమేనీ ప్రాణాలతో లేడనే మాట వింటున్నా- ఇరాన్ సరెండర్ కావడం బెటర్: ట్రంప్ -
అలా బతికిపోయిన మొజ్తబా ఖమేనీ..! బాంబు దాడిపై షాకింగ్ ఆడియో లీక్..! -
ఎంబసీకి చెప్పకుండా ఆ పని చెయ్యొద్దు: ఇరాన్ లోని భారతీయులకు హై అలెర్ట్! -
'డాన్సింగ్ మిసైల్' ను ప్రయోగించిన ఇరాన్.. భారీ విధ్వంసం..! -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
ఒకేసారి 10 మిస్సైళ్లు ప్రయోగించిన కిమ్-అమెరికాకు బిగ్ షాక్..! -
ట్రంప్‌కు మిత్రదేశాల బిగ్ షాక్! -
Bab-el-Mandeb: ఎర్ర సముద్రంలో మరో హార్ముజ్- అదీ మూసేస్తే చమురుకు చుక్కలే..! -
నెతన్యాహు అంతమే లక్ష్యం.. ఇరాన్ "రివల్యూషనరీ గార్డ్స్" శపథం !! -
ట్రంప్ పర్సనల్ మొబైల్ నంబర్ కావాలా..? అయితే ఇలా చేయాలట..!! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’












Click it and Unblock the Notifications