కనిపించిన అమ్మాయిలను కాల్చేస్తా...ఈ యువకుడు ఎందుకు ఇలా చెబుతున్నాడంటే..?

ప్రేమోన్మాదులు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉంటారనేదానికి ఈ కథే నిదర్శనం. ప్రేమించేందుకు అమ్మాయి దొరకలేదన్న అక్కసుతో కనిపించిన అమ్మాయిలందరినీ చంపేస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉతాహాలో చోటుచేసుకుంది.

ప్రేమోన్మాదులు మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఉంటారనేదానికి ఈ కథే నిదర్శనం. ప్రేమించేందుకు అమ్మాయి దొరకలేదన్న అక్కసుతో కనిపించిన అమ్మాయిలందరినీ చంపేస్తానని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉతాహాలో చోటుచేసుకుంది.

Will kill all girls I see: Man threatens on Facebook because he ‘never had a girlfriend’

వివరాల్లోకి వెళితే.. ఉతాహాకు చెందిన 27 ఏళ్ల యువకుడు క్రిస్టఫర్ క్లియరీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. తనకు ఇంత వయస్సు వచ్చినప్పటికీ తనను ఒక్క అమ్మాయి కూడా ప్రేమించడం లేదని పోస్టు ద్వారా చెప్పుకొచ్చాడు. అందుకే అమ్మాయిలంటే ద్వేషం కలుగుతోందని చెబుతూ కనిపించిన అమ్మాయిలందరినీ కాల్చి చంపేస్తానని పోస్టులో వెల్లడించాడు. ఫేస్ బుక్ పోస్టు కాస్త వైరల్ అవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. క్రిస్టఫర్ డెన్వర్ నగరానికి చెందినవాడని గుర్తించారు.

తనకు డబ్బులు, ఇతరత్ర ఖరీదైన వస్తువులు వద్దని కేవలం ప్రేమించేందుకు ఒక్క అమ్మాయి కావాలని తన పోస్టులో వెల్లడించాడు. తనను ప్రేమించే అమ్మాయి కావాలని చెప్పిన క్రిస్టఫర్... ఒక్క అమ్మాయి కూడా దొరకడం లేదని చెప్పాడు. తాను ఇంకా వర్జిన్ అని చెప్పుకున్న క్రిస్టఫర్ ఇంత మంచి గుణాలున్న తనను ఎవరూ ఎందుకు ప్రేమించరని ప్రశ్నించాడు. అందుకే ఇక కనిపించిన అమ్మాయిలందరినీ కాల్చి చంపేయాలన్న డెసిషన్ తీసుకున్నట్లు క్రిస్టఫర్ వెల్లడించాడు. " నా ప్రాణాలు నాకు ముఖ్యంకాదు.. నేను చనిపోయేందుకు రెడీగా ఉన్నాను. అంతకంటే ముందు కనిపించిన అమ్మాయిలను కాల్చి చంపేస్తాను " అని తెలిపారు.

క్రిస్టఫర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై ఉగ్రవాద చర్యల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్న క్రిస్టఫర్ తరపును వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రావడం లేదు. క్రిస్టఫర్ వ్యాఖ్యలకు నిరసనగా మహిళలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+