ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగితే క్యాన్సర్ వస్తుందా?

ఆహార పదార్థాల ప్యాకింగ్‌లో ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే వాదనలు తరచూ వింటూనే ఉంటాం.
ప్లాస్టిక్ బాటిళ్లను ఎండలో ఉంచినప్పుడు, వాటి నుండి క్యాన్సర్‌కు కారణం అయ్యే రసాయనాలు విడుదలవుతాయని, అవి నీటిలో కరిగి శరీరంలోకి చేరుతాయని వివరించే ఒక ఈ-మెయిల్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ ఈమెయిల్‌లోని అంశాలు ఓ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధన పత్రానివిగా పలుమార్లు పేర్కొన్నారు. అయితే, అది ఓ నకిలీ ఈ-మెయిల్.

ఆందోళన కలిగిస్తున్న బీపీఏ రసాయనం
అయితే, శాస్త్రీయంగా బిస్ ఫినాల్ ఏ(బీపీఏ) అనే రసాయనం గురించి కొన్ని ఆందోళనలు ఉన్నాయి.
పాలికార్బోనేట్ కంటైనర్లు, ఫుడ్ బాక్స్ లైనింగ్‌లతో పాటు రసీదులు, స్టాంప్‌లలో ఉపయోగించే కాగితంలో బీపీఏ రసాయనం కనిపిస్తుంది.
బీపీఏ ఒక స్త్రీ హార్మోన్ లాగా ప్రభావం చూపిస్తూ హాని కలిగించవచ్చు. అయితే, ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని ఇంకా నిరూపితం కాలేదు.

బీపీఏ హానికరమని ఆధారాలు ఉన్నాయా?
బీపీఏ అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు, ఎలుకలకు, ముఖ్యంగా గర్భంతో ఉన్న లేదా చాలా చిన్న ఎలుకలకు హాని కలుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
కానీ, మానవుల్లో బీపీఏ వంటి రసాయనాలను చాలా భిన్నంగా జీర్ణమవుతాయి. ప్రస్తుతం మనిషి శరీరంలోకి ప్రతిరోజూ వెళ్ళే బీపీఏ హాని కలిగిస్తుందో లేదో చెప్పడానికి బలమైన ఆధారాలు లేవు.
ప్యాకేజింగ్ పనిలో బీపీఏను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో చాలా మంది పెద్ద వయసు వారి మూత్రంలో బీపీఏ ఉన్నట్టు అంచనా వేశారు.
అయితే, ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌లో బీపీఏని ఉపయోగించకపోవడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చు. చాలా ప్లాస్టిక్ పరికరాలపై నంబర్ ముద్రించి ఉంటుంది. దీంతో వాటిలో బీపీఏ ఉందో లేదో గుర్తించవచ్చు.

బీపీఏని ఎలా గుర్తించాలి?
త్రిభుజాకార రీసైక్లింగ్ చిహ్నం (♲) లోపల నెంబర్ ముద్రించి ఉంటుంది. 1, 2, 4 లేదా 5 అంటే ప్లాస్టిక్ 'బీపీఏ రహితం'
3 లేదా 7 నెంబర్ ఉంటే ప్లాస్టిక్‌లో బీపీఏ ఉండవచ్చు. మీరు ప్లాస్టిక్‌ని వేడి చేస్తే లేదా డిటర్జెంట్‌ని పోస్తే, దాని నుండి బీపీఏ విడుదల చేయవచ్చు. ప్లాస్టిక్‌పై ఉన్న సంఖ్య 6 అంటే అది పాలీస్టైరిన్‌తో తయారు చేసినట్టు.
యూరోపియన్ యూనియన్‌లో, పిల్లల సీసాలు, బొమ్మల కోసం ఉపయోగించే ప్లాస్టిక్‌లు తప్పనిసరిగా 'బీపీఏ- రహితంగా' ఉండాలి.
అయితే, ఆహారం డబ్బాల లైనింగ్‌లు, వేడికి స్పందించే రసీదులు ఇప్పటికీ బీపీఏని కలిగి ఉంటున్నాయి. అందువల్ల సాధారణ జీవితంలో బీపీఏని నివారించడం దాదాపు అసాధ్యం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికలు తలలు పగలగొట్టుకునే వరకు ఎందుకెళ్లాయి?
- 'చైనా ఫోన్లు కొనకండి, మీ దగ్గరున్నవి వీలైనంత త్వరగా పడేయండి’
- కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం, పొందడం ఎలా?
- నాగ చైతన్యతో విడాకుల రూమర్స్‌పై మీడియా ప్రశ్న.. 'గుడికి వచ్చి.. బుద్ధుందా?’ అన్న సమంత
- సమంత అక్కినేని: నన్ను భయపెట్టే పాత్రలనే చేస్తా
- బ్రసెల్స్: కొత్తగా నిర్మిస్తున్న వీధికి ఒక సెక్స్ వర్కర్ పేరు.. ఎందుకంటే..
- సీతాఫలంపై చైనా, తైవాన్ మధ్య వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications