అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా సేనల ఉపసంహరణ పూర్తయింది.. అక్కడి నుంచి వెళ్లిపోయిన చిట్టచివరి సోల్జర్ ఈయనే

ఇరవై ఏళ్ల పాటు అఫ్గానిస్తాన్‌లో ఉన్న అమెరికా సేనలు నేటితో(ఆగస్టు 31, 2021) అక్కడి నుంచి పూర్తిగా వైదొలగనున్నాయి.

ఆ తర్వాత ఆ దేశం సంపూర్ణంగా తాలిబాన్ల హస్తగతం కానుంది.

తాలిబాన్‌లు ఈ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. సోమవారం వారు గాలిలోకి కాల్పులు జరిపి వేడుక చేసుకున్నారు.

అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్ల పాటు సాగిన మిషన్ ముగియబోతోందని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం 'పెంటగాన్' ప్రకటించింది.

https://twitter.com/andrewquilty/status/1432455595194568704

అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయినట్లు అమెరికా సెంట్రల్ కమాండర్ కెన్నెత్ మెకెంజీ ధ్రువీకరించారు.

చివరి అమెరికా విమానం హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం అర్థరాత్రి (స్థానిక సమయం) బయలుదేరింది.

"దీంతో, అఫ్గానిస్తాన్‌లో అమెరికా సేనల తరలింపు ప్రక్రియ పూర్తయినట్లే. 2001 సెప్టెంబర్ 11న ప్రారంభమైన ఇరవై ఏళ్ల పాటు సాగిన అమెరికా మిషన్ ముగిసింది" అని మెకెంజీ తెలిపారు.

https://twitter.com/DeptofDefense/status/1432492782837501956

అఫ్గానిస్తాన్ గడ్డ మీద నుంచి అమెరికా బయలుదేరిన చిట్టచివరి యూఎస్ సోల్జర్ మేజర్ జనరల్ క్రిస్ డొనాహు అని అమెరికా తెలిపింది.

ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ట్వీట్ చేసింది.

విమానం

ఇరవయ్యేళ్లలో అమెరికాకు ఎంత నష్టమంటే..

తాలిబాన్లతో అమెరికా చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఆగస్టు 31 లోపు అమెరికా సైనిక దళాలు ఆ దేశం నుంచి పూర్తిగా వైదొలగాలి.

గత రెండు దశాబ్దాలలో అఫ్గానిస్తాన్‌లో మొత్తం 2461 మంది అమెరికన్ సైనికులు, పౌరులు మరణించారని, 20 వేలకు పైగా గాయపడ్డారని పెంటగాన్ తెలిపింది.

ఇందులో 13 మంది సైనికులు గత వారం కాబుల్ విమానాశ్రయంపై జరిగిన ఐఎస్-కే దాడిలో మరణించారు.

తాలిబాన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్న ముందు రోజు, అంటే ఆగస్టు 14న అమెరికా 79,000 మందికి పైగా పౌరులను ఆ దేశం నుంచి తరలించింది.

ఇందులో 6,000 మంచి అమెరికన్ పౌరులు కాగా, 73,503 కన్నా ఎక్కువమంది ఇతర దేశాల పౌరులు, అఫ్గాన్ పౌరులు ఉన్నారు.

యుద్ధ విమానం

20 ఏళ్ల యుద్ధంలో ఎప్పుడు ఏమైంది?

2001 అక్టోబర్ 7: అమెరికా నేతృత్వంలోని సైనిక దళాల కూటమి, అఫ్గానిస్తాన్‌లోని కాబుల్, కాందహార్, జలాలాబాద్ నగరాలను లక్ష్యాలుగా చేసుకుని తాలిబాన్, అల్-ఖైదా స్థావరాలపై బాంబులతో దాడి చేసింది.

అఫ్గానిస్తాన్‌లో ఓ దశాబ్దం పాటు కొనసాగిన సోవియట్ దళాల ఆక్రమణ, అంతర్యుద్ధం తర్వాత తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. ఆ దేశంలో స్థావరం ఏర్పరచుకున్న అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను అప్పగించేందుకు తాలిబాన్లు నిరాకరించారు.

2001 నవంబర్ 13: పశ్చిమ దేశాల సైనిక దళాల మద్దతుతో అఫ్గానిస్తాన్ ఉత్తర కూటమి కాబుల్‌ను స్వాధీనం చేసుకుంది.

2009 ఫిబ్రవరి 7: అఫ్గానిస్తాన్‌కు పంపే సైనికుల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదించారు. అమెరికా గరిష్ఠంగా 1,40,000 మందిని పంపింది.

2014 డిసెంబర్ 28: అఫ్గానిస్తాన్‌లో నాటో తన యుద్ధ కార్యకలాపాలను ముగించింది. అఫ్గాన్‌లో పరిస్థితులు కుదుటపడడంతో అమెరికా వేలల్లో తమ సైనికులను వెనక్కు రప్పించింది. మిగిలినవారు అఫ్గాన్ భద్రతా దళాలకు శిక్షణ ఇవ్వడంపై ఎక్కువ దృష్టి పెట్టారు.

2020 ఫిబ్రవరి 29: అమెరికా, తాలిబాన్ మధ్య దోహాలో శాంతి ఒప్పందం కుదిరింది. తాలిబాన్ మిలిటెంట్లు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నట్లయితే 14 నెలలలోపు అఫ్గానిస్తాన్ నుంచి తమ సైనిక దళాలను పూర్తిగా ఉపసంహరించుకునేందుకు అమెరికా, నాటో కూటమి అంగీకరించింది.

2021 ఏప్రిల్ 13: సెప్టెంబర్ 11 నాటికి అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా సైనిక దళాలన్నీ వెనుదిరుగుతాయని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

2021 ఆగస్ట్ 16: కేవలం నెలరోజుల్లోనే తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించుకున్నారు. కాబుల్‌ను కూడా స్వాధీనం చేసుకోవడంతో అఫ్గాన్ భద్రతా దళాలు పూర్తిగా లొంగిపోయాయి.

2021 ఆగస్టు 31: అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+