Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వార్నీ.. ఫోన్ లో టైప్ చేస్తూ.. గోతిలో పడిపోయింది, వీడియో వైరల్ అయింది

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ మహిళ(67) తన సెల్‌ఫోన్‌ చూసుకుంటూ పరధ్యానంగా ఫుట్‌పాత్‌పై నడుస్తూ ప్రమాదానికి గురైంది. ఆమె సెల్‌ఫోన్‌లో సంక్షిప్త సందేశాలను టైప్‌ చేస్తూ ఫుట్‌పాత్‌పై నడుస్తుండగా

న్యూజెర్సీ : సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడిపేవాళ్లు ఎందరో. అలాగే సెల్ ఫోన్ లో చూసుకుంటూ రోడ్లపై పరధ్యానంగా నడుస్తూ ప్రమాదాలకు గురవుతున్నవాళ్లు కూడా కోకొల్లలు. ఇది సరిగ్గా అలాంటి సంఘటనే.

అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ మహిళ(67) తన సెల్‌ఫోన్‌ చూసుకుంటూ పరధ్యానంగా ఫుట్‌పాత్‌పై నడుస్తూ ప్రమాదానికి గురైంది. ఆమె సెల్‌ఫోన్‌లో సంక్షిప్త సందేశాలను టైప్‌ చేస్తూ
ఫుట్‌పాత్‌పై నడుస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఆ దారిలో తెరిచి ఉన్న ఓ బేస్‌మెంట్‌ డోర్లను ఆమె గమనించలేకపోయింది. దీంతో ఒక్కసారిగా అదుపుతప్పి అందులో పడిపోయింది. అదే సమయంలో అటుగా వెళుతున్న ఇద్దరు మహిళలు ఈ ఘటన చూసి నిశ్చేష్టులయ్యారు.

6 అడుగుల లోతులో ఉన్న గోతిలో ఆమె పడడంతో విషయం తెలిసి పలువురు అక్కడికి చేరుకుని బాధితురాలిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఆ మహిళకు తీవ్ర గాయాలవడంతో ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.

గ్యాస్‌ పైప్‌లైన్లకు మరమ్మతు పనులు చేపట్టేందుకు ఆ బేస్‌మెంట్‌ డోర్లను తెరిచినట్లు అధికారులు తెలిపారు. అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరూ చూడండి!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+