వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డుపైనే యోగా చేసిన మహిళ, అభినందనల వెల్లువ

రోడ్డుపైనే ఓ మహిళ యోగా చేసింది. అయితే రోడ్డుపైనే మహిళా యోగా చేయడాన్ని ఎవరూ కూడ వ్యతిరేకించలేదు. పైగా ఆమె యోగా చేయడంతో పలువురు ప్రశంసలతో ఆమెను ముంచెత్తారు.ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: రోడ్డుపైనే ఓ మహిళ యోగా చేసింది. అయితే రోడ్డుపైనే మహిళా యోగా చేయడాన్ని ఎవరూ కూడ వ్యతిరేకించలేదు. పైగా ఆమె యోగా చేయడంతో పలువురు ప్రశంసలతో ఆమెను ముంచెత్తారు.ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకొంది.

సాధారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ప్రత్యామ్నాయమార్గాల కోసం వెతుకుతాం. ట్రాఫిక్ క్లియరయ్యే వరకు వేచి చూస్తాం. ట్రాఫిక్ క్లియరయ్యే వరకు చిరాకు పడుతూనే ఉంటాం.

అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది ట్రాఫిక్ క్లియరయ్యేవరకు ఆమె నడిరోడ్డుపైనే యోగా ప్రాక్టీస్ చేసింది. ఈ సమయాన్ని ఆమె యోగా చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకొంది. రోడ్డుపైనే ట్రాఫిక్ జామ్ తో వాహానాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

అయితే రోడ్డుపై ఖాళీ స్థలంలో ఆమె మ్యాట్ వేసుకొని మరీ యోగ సాధన చేయడంతో పలువురు ప్రశంసలతో ముంచెత్తారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన క్రిస్టిన్ బిజార్సెన్ అనే మహిళ గత బుదవారం నాడు విమామీ రహదారిపై కారులో వెళ్తోంది.

ఇంతలో ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ క్లియరయ్యేందుకుగాను దాదాపుగా రెండు గంటలపాటు చిక్కుకొంది.అయితే ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని ట్రాఫిక్ అధికారులు తేల్చిచెప్పారు.

తీవ్ర అసహనానికి లోనైన ఆమె వెంటనే మ్యాట్ తీసి రోడ్డుపై పరిచింది. భుజంగఆసనం చేయడం మొదలుపెట్టింది. వెంటనే ఆమె ఫ్రెండ్స్ ఫోటోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే రోడ్డుపైనే క్రిస్టిన్ యోగా చేయడంపై నెటిజన్లు ఎవరూ కూడ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. పైగా ఆమె చేసిన పనిని మెచ్చుకొన్నారు.

English summary
After getting stuck behind an accident Wednesday morning on I-95 in northern Miami-Dade County that left lanes closed for hours, Bjornsen broke out her yoga mat, practiced some poses and posted the evidence on Twitter,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X