లవ్ ప్రపోజల్‌కు ఒప్పుకుందని ఎయిర్ హోస్టెస్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం
చైనా : చైనాలో ఒక యువతిని ఒక వ్యక్తి తాను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేశాడు. వ్యక్తి తన ప్రేమను వ్యక్తపరచడంతో అమ్మాయి కూడా ఓకే చెప్పేసింది. అమ్మాయి ఆ ప్రేమకు ఓకే చెప్పడంతో ఆమె ఉద్యోగం ఊడింది. ఇదేంటి ప్రేమకు ఉద్యోగం ఊడేందుకు లింకు ఏమిటనేగా మీ డౌటు...? అక్కడికే వస్తున్నాం. అబ్బాయి తన ప్రేమను వ్యక్త పరిచింది ఎక్కడో కాదు... విమానంలో. అది కూడా గాల్లో ఎగురుతుండగా... అది కూడా విమానంలో పనిచేస్తున్న మహిళా సిబ్బిందికి. ఇలా ఆ రాకుమారుడు ప్రపోజ్ చేయడం... ఆమె అందుకు ఒప్పుకోవడం... వెంటనే ఆమె ఉద్యోగం కాస్త ఊడిపోవడం అన్ని కొన్ని రోజుల్లోనే జరిగిపోయాయి. ఇంతకీ ఆ అబ్బాయి ప్రపోజ్ చేయడం బయటకు ఎలా పొక్కిందో తెలుసా... ప్రపోజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఇక వివరాల్లోకి వెళితే... చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న ఓ యువతి తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి ఒప్పుకోవడంతో ఆమెను ఉద్యోగం నుంచి తీసేసింది ఆ విమానాయాన సంస్థ. విమానం గాల్లో ఉన్న సమయంలో తనను పెళ్లిచేసుకోవాల్సిందిగా ఆ అబ్బాయి.. అమ్మాయిని కోరాడు. అయితే ఆ సమయంలో తన బాధ్యతలు మరిచి ప్రవర్తించిందని పేర్కొంటూ అమ్మాయిని ఉద్యోగం నుంచి తొలగించింది విమానాయాన సంస్థ. ఈ మేరకు ఆ అమ్మాయికి సెప్టెంబర్ 10న లేఖ పంపింది సంస్థ. ఈ ఏడాది మేలో అబ్బాయి ఈ విమానాయాన సంస్థలో పనిచేసే అమ్మాయికి ప్రపోజ్ చేయడం జరిగింది.

ఈ ఏడాది మేలో విమానం టేకాఫ్ అయిన అరగంటకు విమానంలో ఆ అబ్బాయి ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం ఆ తర్వాత యాజమాన్యం అమ్మాయిని తొలగించడం జరిగిపోయింది. ఈ వార్త చైనాలో గుప్పుమనగానే... నెటిజెన్లు అమ్మాయిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని తప్పుబడుతున్నారు. కొందరు వ్యక్తిగత విషయాలను ప్రొఫెషనల్ లైఫ్‌తో కలిపి చూడటం సరికాదన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications