Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పది మంది పిల్లల్ని కనండి.. రూ. 13 లక్షలు అందుకోండి: ఆ దేశాధ్యక్షుడి ప్రకటన

మాస్కో: భారత్, చైనా లాంటి దేశాలు జనాభాను తగ్గించేందుకు చర్యలు చేపడుతుంటే.. రష్యా మాత్రం తమ దేశ జనాభాను పెంచేందుకు కసరత్తులు ప్రారంభిస్తోంది. జననాల రేటు ఊహించని విధంగా తగ్గిపోవడంతో.. సోవియట్ యూనియన్ కాలం నాటి 'మదర్ హీరోయిన్' అనే నినాదాన్ని మరోసారి ముందుకు తీసుకొచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ మేరకు మాస్కో టైమ్స్ తన కథనంలో వెల్లడించింది.

సోవియట్ కాలంలోనే ‘మదర్ హీరోయిన్'

సోవియట్ కాలంలోనే ‘మదర్ హీరోయిన్'

సోవియట్ ఎరాలో ఎక్కువ మంది పిల్లలు కన్న మహిళకు మదర్ హీరోయిన్ అనే పేరుతో గౌరవించడం జరిగేది. లక్షలాది మంది ప్రజలు మరణించడంతో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జననాలు పెంచేందుకు తొలిసారి 1944లో మదర్ హీరోయిన్ అనే టైటిల్‌ను సోవియేట్ నేత జోసెఫ్ స్టాలిన్ తీసుకొచ్చారు. 1991లో సోవియేట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత ఈ నినాదం ఆగిపోయింది.

పది లేదా ఎక్కువ పిల్లల్ని కన్న మహిళకు రూ. 13 లక్షలు

పది లేదా ఎక్కువ పిల్లల్ని కన్న మహిళకు రూ. 13 లక్షలు

పది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలే కన్న మహిళలకు 'మదర్ హీరోయిన్' అనే టైటిట్‌‌తో గౌరవిస్తారు. అంతేగాక, పది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కన్న మహిళలకు.. పదో బిడ్డ జన్మించగానే.. 1 మిలియన్ రూబుల్స్(రూ. 13.27 లక్షలు) ప్రభుత్వం అందిస్తుంది. ఈ మేరకు పుతిన్ డిక్రీ విడుదల చేశారు. పదో బిడ్డ జన్మించే సమయంలో ఏదైనా జరిగి చనిపోవడం లేదా ఉగ్రవాదుల దాడిలో మరణించడం లాంటివి జరిగినా కూడా ఈ మొత్తం ఆమెకు అందజేయడం జరుగుతుంది.

అందుకే మళ్లీ ‘మదర్ హీరోయిన్' అత్యున్నత గౌరవం

అందుకే మళ్లీ ‘మదర్ హీరోయిన్' అత్యున్నత గౌరవం

హై ర్యాంకింగ్ స్టేట్ లెవల్ ఆర్డర్ హీరో ఆఫ్ రష్యా, హీరో ఆఫ్ ల్యాబోర్ లాంటి అత్యున్నత పురస్కారాలతో సమానంగా మదర్ హీరోయిన్ టైటిల్‌కు గౌరవం ఉంటుంది. జూన్ 1న రష్యా చిల్డ్రెన్ డే హాలిడే రోజున మొదటి వ్లాదిమిర్ పుతిన్.. మదర్ హీరోయిన్ టైటిల్‌ను తిరిగి తీసుకొచ్చేందుకు అంగీకరించలేదు. కానీ, ప్రస్తుతం రష్యాలో జననాల రేటు భారీగా తగ్గిపోవడంతో మరోసారి మదర్ హీరోయిన్ టైటిట్ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

సోవియట్ పతనం తర్వాత తగ్గిన రష్యా జనాభా.. మళ్లీ ఇప్పుడే

సోవియట్ పతనం తర్వాత తగ్గిన రష్యా జనాభా.. మళ్లీ ఇప్పుడే

పెద్ద కుటుంబాలు రష్యన్ సమాజంలో క్రమంగా పునరుద్ధరణను చూస్తున్నాయని రష్యా అధ్యక్షుడు పేర్కొన్నారు. రష్యా జనాభా దశాబ్దాలుగా దాదాపు స్థిరంగా క్షీణిస్తోంది, 2022 ప్రారంభంలో దాదాపు 400,000 క్షీణత తర్వాత 145.1 మిలియన్లకు పడిపోయింది. కరోనా వైరస్ మహమ్మారి సహజ జనాభా క్షీణతకు దారితీయడంతో.. దేశ జనాభా క్షీణత రేటు 2021 నుంచి దాదాపు రెట్టింపు అయింది.

సోవియట్ యూనియన్ పతనం తర్వాత 1990లలో రష్యా జనాభా గణనీయంగా పడిపోయింది.ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు జననాల రేటు పడిపోవడంతో మరోసారి రష్యా.. మళ్లీ మదర్ హీరోయిన్ టైటిల్ బాటపట్టింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+