వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన టెక్కీలకు సవాలే: వర్క్ వీసాతో ‘గ్రీన్ కార్డు’ కష్టమే

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో హెచ్ - 1 బీ వీసాపై ఉద్యోగం చేయడానికి వెళ్లే భారతీయలు శాశ్వత నివాసం కోసం గ్రీన్‌కార్డు పొందాలంటే ఇకనుంచి సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కన్పిస్తోంది. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్ - 1 బీ వీసా హోల్డర్లకు వచ్చేనెల ఒకటో తేదీ నుంచి యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్‌ (యూఎస్‌సీఐఎస్‌) నేరుగా ముఖాముఖీ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నది. దరఖాస్తు దారులు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిందే.
సాంకేతికంగా మార్పులు చేస్తూ గత నెల 28వ తేదీన ఒక ప్రకటన చేసింది. మరోవైపు యూఎస్‌సీఐఎస్‌ జారీ చేసే రిక్వెస్ట్స్‌ ఫర్‌ ఎవిడెన్స్‌ (ఆర్‌ఎఫ్‌ఈ)లను యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అటార్నీ అడుగుతున్నారు. గత ఏప్రిల్‌లో దరఖాస్తు చేసుకున్న హెచ్‌-1బీ వీసాలు వచ్చేనెల అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి చెల్లుబాటు కానున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఆర్‌ఎఫ్‌ఈలు సమర్పించాల్సి ఉంటుంది.

2010 - 14 మధ్య రెండు లక్షల మందికి గ్రీన్ కార్డులు

2010 - 14 మధ్య రెండు లక్షల మందికి గ్రీన్ కార్డులు

ఎన్‌పీజెడ్‌ లా గ్రూప్‌ మేనేజింగ్‌ అటార్నీ డేవిడ్‌ హెచ్‌ నచ్‌మన్‌ మాట్లాడుతూ.. ‘కుటుంబ ఆధారిత గ్రీన్‌కార్డు పొందేందుకు యూఎస్‌సీఐఎస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. చాలా సందర్భాల్లో దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ ప్రక్రియ అవసరం లేదు. ఉద్యోగ వీసాతో అమెరికాలో ఉంటూ గ్రీన్‌కార్డు పొందాలని భావించే వారు ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. దశాబ్దకాలం నుంచి ఇదే పద్ధతి అనుసరిస్తున్నాం. కొత్త విధానంలో కార్డుల ఎత్తివేత ఉండదు. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగడంతో గ్రీన్‌కార్డు దరఖాస్తులు దారులు నిరీక్షించాల్సి వస్తుంది' అని తెలిపారు. 2010 నుంచి 2014 మధ్య హెచ్‌-1బీ వీసా కలిగిన రెండు లక్షల మందికి గ్రీన్‌కార్డులు వచ్చినట్లు బాపిస్టిన్‌ పాలసీ సెంటర్‌ తన నివేదికలో తెలిపింది. యూఎస్‌సీఐఎస్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015లో 34,843మంది భారతీయులు తమ తాత్కాలిక వీసా స్టేటస్‌ సవరించుకునేందుకని గ్రీన్‌కార్డులు పొందారు. ఇందులో 25,179 మంది హెచ్‌-1బీ కేటగిరిలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారే కావడం గమనార్హం.

ఎనిమిది లక్షల మందిపై ఇలా ప్రతికూల ప్రభావం

ఎనిమిది లక్షల మందిపై ఇలా ప్రతికూల ప్రభావం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరికొద్ది గంటల్లో తీసుకోనున్న నిర్ణయం సుమారు ఎనిమిది లక్షల వలసదారులకు జీవితం పీడకలలా మారనున్నది. చిన్నారులుగా ఉన్నప్పడు తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఇప్పుడు పెద్దయ్యాక ఉద్యోగాలు చేస్తున్నవారిని ట్రంప్‌ అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. వారిని తిప్పి పంపే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో ఇలాంటి వారిని ‘స్వాప్నకులు' (డ్రీమర్స్‌) అని పిలుస్తారు. గతంలో ఇలాంటి వారిని గుర్తించిన ఒబామా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా 2012లో ఉత్తర్వులు ఇచ్చింది. ‘బాల్యంలో వచ్చిన వారిపై చర్యలు వాయిదా' (డిఫెర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ ఛైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌- డీఏసీఏ) అన్న పేరుతో కార్యక్రమం చేపట్టింది. ఒబామా ఇచ్చిన అధ్యక్ష ఉత్తర్వులను ఈ నెల అయిదో తేదీలోగా రద్దు చేయాలని, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ట్రంప్‌నకు అనుకూలంగా ఓటేసిన రాష్ట్రాలు హెచ్చరించాయి. అధ్యక్షుడు మాత్రం ‘స్వాప్నికుల'కు వెంటనే పంపకుండా రెండేళ్ల సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వారు ప్రతి ఏటా తమ పాస్‌పోర్టు నవీకరించుకునేలా నిబంధన తేనున్నట్టు తెలిసింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని పలు వర్గాల నుంచి వస్తున్నవిజ్ఞప్తులను పట్టించుకునేలా కనిపించడం లేదు. వీరితోనే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని ట్రంప్‌ మద్దతుదార్లు అంటున్నారు.

ట్రంప్ ఆలోచనలపై సీఈవోలు ఇలా

ట్రంప్ ఆలోచనలపై సీఈవోలు ఇలా

ఒబామా ఇచ్చిన డీఏసీఏ ఉత్తర్వులను రద్దు చేయవద్దని పలువురు సీఈవోలు విజ్ఞప్తి చేశారు. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల లింకెన్‌ఇన్‌లో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన ఉద్యోగులు మన కంపెనీకి, మన వినియోగదారులకు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్షంగా సహకరిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌లో ఇదే కీలకం. అమెరికాలోనూ ఇదే కీలకమని భావిస్తున్నా' అని పేర్కొన్నారు.ఫేస్‌బుక్‌లో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన అభిప్రాయం చెబుతూ ‘‘నేను డ్రీమర్స్ తరఫున ఉన్నాను. ఆ యువకులతంతా తమ తల్లిదండ్రుల వెంట వచ్చారు. వారికి ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. వారికి ఈ దేశమంటే ప్రత్యేకమైన ప్రేమ. ఇక్కడ జీవితం సాగిపోతుందన్న ధీమా వారికి లేదు. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకొని దేశం, సమాజం సేవ చేస్తున్నారు' అని పేర్కొన్నారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిఛాయ్‌, అమెజాన్‌ చీఫ్ జెఫ్‌ బెసోజ్‌, వారెన్‌ బఫెట్‌ వంటి ప్రముఖులు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు.

English summary
NEW YORK: Heretofore, thousands every year transited to US Green Card through their work visa in the country. H1 B route was found to be quite convenient to obtain a green card. But it appears it is not going to be the same “easy and convenient” route anymore. As reported in The Indian Panorama earlier, from October 1, the United States Citizenship and Immigration Service (USCIS) has made an in-person interview mandatory in such cases. In technical parlance, it refers to an I-485 adjustment of status interview. This announcement was made on August 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X