వరల్డ్ వార్-3కి బ్రేక్? ట్రంప్ 'శాంతి' చక్రం.. గడగడలాడుతున్న శత్రు దేశాలు!

ప్రపంచాన్ని వణికిస్తున్న రెండు పెద్ద యుద్ధాలు ముగింపు దశకు చేరుకున్నాయా? 2026 కొత్త సంవత్సరం లక్షలాది మంది జీవితాల్లో శాంతిని నింపబోతోందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాలకు విరామం పలికేందుకు రంగం సిద్ధమైంది. నూతన సంవత్సరంలో ప్రపంచ శాంతి దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఈ భీకర యుద్ధాలకు ముగింపు పలికేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కావడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్క్సీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫ్లోరిడా పయనమవుతున్నారు.

ఫ్లోరిడాలో హై-లెవెల్ మీటింగ్
ఈ ఆదివారం(డిసెంబర్ 28) ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, సోమవారం(డిసెంబర్ 29) రోజున ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ట్రంప్ నివాసం 'మార్-ఎ-లాగో'లో ఆయనతో విడివిడిగా భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో యుద్ధ విరమణ, శాంతి ఒప్పందాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

World War 3 Averted Donald Trump Peace Talks with Ukraine and Israel Signal Hope

ఉక్రెయిన్ శాంతి ప్రణాళిక: 90శాతం సిద్ధం!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ సిద్ధం చేసిన 20 అంశాల శాంతి ప్రణాళిక దాదాపు 90శాతం పూర్తయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, భవిష్యత్తులో భద్రతా హామీలపై ఈ చర్చలు ప్రధానంగా సాగనున్నాయి. "మేము ఒక్క రోజు కూడా వృథా చేయడం లేదు. కొత్త సంవత్సరానికి ముందే కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది" అని జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణపై నజర్
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ట్రంప్ జరిపే చర్చల్లో గాజాలో రెండో దశ కాల్పుల విరమణ, బందీల విడుదలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే అక్టోబర్‌లో కుదిరిన మొదటి దశ ఒప్పందం తర్వాత, శాశ్వత శాంతి కోసం ట్రంప్ యంత్రాంగం గట్టిగా ప్రయత్నిస్తోంది.
జనవరి 2026 నాటికి గాజా యుద్ధానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

చాలా కాలంగా సాగుతున్న ఈ యుద్ధాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ట్రంప్ తనదైన శైలిలో ఈ సంక్షోభాలను పరిష్కరిస్తే, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, శాంతికి పెద్ద ఊరటనిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+