ప్రపంచంలోనే అత్యంత అరుదైన పాము: 64ఏళ్ల తర్వాత మళ్లీ కనిపించింది..

దాదాపు 64ఏళ్ల క్రితం కనిపించిన ఈ పాము ఆనవాళ్లు తిరిగి ఇన్నాళ్లకు ఉనికిలోకి రావడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వాషింగ్టన్‌: ప్రపంచీకరణ దుష్ఫలితాలతో ప్రపంచవ్యాప్తంగా చాలా జీవులు ఉనికిలో లేకుండా పోతున్న దుస్థితి నెలకొంది. తాజాగా అంతరించిపోతున్న ఓ అరుదైన పాము జాతిని బ్రెజిల్ లోని స్థానికులు గుర్తించారు.

దాదాపు 64ఏళ్ల క్రితం కనిపించిన ఈ పాము ఆనవాళ్లు తిరిగి ఇన్నాళ్లకు ఉనికిలోకి రావడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 'క్రోపన్స్‌ బోవా'గా పరిగణించే ఈ పాము 1.7 మీటర్ల పొడవు, 1.5 కేజీల బరువు ఉన్నట్లు నిర్దారించారు. 1953లో చివరిసారిగా ఈ జాతి సర్పాలను గుర్తించారు.

Worlds Rarest Boa Rediscovered After 64 Years

తొలుత ఈ పాము స్థానికులు కంటపడగా.. శాస్త్రవేత్తలకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి 'క్రోపన్స్‌ బోవా'కు చెందిన అరుదైన సర్పజాతిగా దీన్ని గుర్తించారు.బ్రెజిల్‌లోని అట్లాంటిక్‌ అడవుల్లో మాత్రమే ఈ రకం పాములు కనిపిస్తుంటాయని చెబుతున్నారు.

తాజాగా గుర్తించిన క్రోపనస్ బోవాను ఆడ పాముగా శాస్త్రవేత్తలు గుర్తించారు. దానికి ఓ రేడియో ట్రాన్స్ మీటర్ ను బిగించి తిరిగి అడవుల్లోకి వదిలారు. తద్వారా దాని జీవన విధానం తెలుసుకోవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+