వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

video viral:ప్రధాని బెడ్‌పై ఫైటింగ్, వైరల్.. ఆందోళనకారులు ఇలా..

|
Google Oneindia TeluguNews

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో జనం ఆందోళన మిన్నంటిన సంగతి తెలిసిందే. ప్రధాని రాజీనామా చేయగా, అధ్యక్షుడు బుధవారం రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే ఆందోళనకారులు ప్రధాని, అధ్యక్షుడు నివాసాల వద్ద రచ్చ రచ్చ చేశారు. ప్రధాని విక్రమసింఘే ఇంటికి కొందరు ఆందోళనకారులు వచ్చారు. ఆ వీడియో వైరల్ అవుతుంది. మీరు కూడా చూడండి. అధ్యక్షుడి ఇంటి వద్దకు వచ్చిన వారు స్విమ్మింగ్ పూల్, డైనింగ్ హాల్ వద్దకు వచ్చారు. బెడ్ రూమ్‌లో సేదా తీరారు. జిమ్‌లో ఆడారు. ఇటు ప్రధాని బెట్ వద్ద వారు ఫైట్ చేశారు.

వీడియోను ట్వీట్ చేశారు. ఇద్దరు ప్రధాని అధికార కార్యాలయ నివాసంలో కుస్తీ పడ్డారు. ఆ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ కూడా రెజ్లింగ్ మ్యాచ్‌కు సంబంధించిన ఆడియో ఉంది. అక్కడ వారు ప్రొఫెషనల్ రెజ్లర్ల మాదిరిగా కొట్టుకుంటు కనిపించారు. శ్రీలంక జనం నిరసనలతో ప్రధాని రాజీనామా చేయగా.. అధ్యక్షుడు పారిపోయారు. పార్టీ కొత్త నేతను ఎన్నుకోనుంది. అయితే అధ్యక్షుడు గొటబయ రాజపక్సే 13వ తేదీన రాజీనామా చేసేందుకు అంగీకరించారు. కానీ అతని నివాసం వద్దకు ఆందోళనకారులు రావడంతో అంతకుముందు పారిపోయారు.

WWE On Lankan PMs Bed After Protesters Occupy Pool, Gym

ప్రధాని విక్రమసింఘే రాజీనామా ప్రకటించారు. ఆ వెంటనే మంత్రి బందుల గుణవర్దన రిజైన్ చేశారు. ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది జర్నలిస్టులపై దాడి చేశారు. ఘటనను అంతా ఖండించారు. మరోవైపు పార్టీ నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్పీకర్ అధ్యక్షుడు రాజపక్సేకు తెలియజేశారు. దీంతో అధ్యక్షుడు కూడా 13వ తేదీన రాజీనామా చేస్తారని తెలిసింది. అఖిలపక్ష సమావేశంలో విక్రమసింఘే తన నిర్ణయాన్ని తెలియజేశారు. శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో.. విక్రమసింఘే పదవీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు రాజపక్సే కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి.

English summary
protesters had earlier torched the private residence of Prime Minister Ranil Wickremesinghe even after he offered to resign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X