షాక్: లైవ్ న్యూస్ కవర్ చేస్తూ లేడీ రిపోర్టర్ ఆకస్మిక మృతి(వీడియో)
ఇస్లామాబాద్: ఓ వార్తా ఛానల్‌లో రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ యువతి హఠాత్తుగా కిందపడిపోయింది. కొద్ది క్షణాల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.
ఓ క్రేన్ ఆధారంగా పైన నుంచి వార్తలు కవర్ చేస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా ఆమె ఒళ్లంతా వణికిపోయింది. వెంటనే అక్కడ్నుంచి కిందపడిపోయింది. అక్కడే ఉన్న ప్రజలు, సిబ్బంది ఆమెను తట్టిలేపే ప్రయత్నం చేశారు.
కానీ, ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆమె మృతి చెందింది. ఇదంతా అక్కడున్న వారు తమ సెల్‌ఫోన్లో వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. లైవ్‌లో వార్తలు చదువుతూ యువతి మృతి చెందడంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది.
ఆమెకు గుండెపోటు లేదా తీవ్రమైన పక్షవాతం వచ్చినట్లు తెలుస్తోందని అక్కడున్న వారంటున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications