పుతిన్ త్వరలో చనిపోతారు.. యుద్ధం ఆగిపోతుంది: జెలెన్ స్కీ సంచలనం

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. అయినా ఇరు దేశాల మధ్య చెదురుమొదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక రష్యా, ఉక్రెయిన్ ల మధ్య చొరవతీసుకున్నారు. ఇరు దేశాలు శాంతి చర్చలు జరపాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి.

అమెరికానే ఇరు దేశాల మధ్య పెద్దన్న పాత్ర వహిస్తూ శాంతిని నెలకొల్పేందుకు యత్నిస్తోంది. రష్యా, ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలన్న అగ్రరాజ్యం సిఫార్సును ఉక్రెయిన్ అంగీకరించింది. మరోవైపు రష్యా నుంచి మాత్రం ఇంకా అంగీకారం రాలేదు. ఇదే విషయంపై రష్యాను ఒప్పించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది.

Zelensky s Bold Statement Putin Will Die Soon Ending the War

ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉద్దేశిస్తూ చేసిన ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. త్వరలోనే పుతిన్‌ చనిపోతారని, అప్పుడే యుద్ధం ఆగిపోతుందని జెలెన్ స్కీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్‌తో సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెలెన్‌స్కీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పుతిన్ ఆరోగ్యంపై ఇటీవల పలు కథనాలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైన పలు వీడియోల్లో పుతిన్‌ దగ్గుతున్నట్లు,ఆయన కాళ్లు, చేతులు వణుకుతున్నట్లు ఉన్నాయి. దీంతో ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఈ క్రమంలో తాజాగా జెలెన్ స్కీ వ్యాఖ్యలు ఆ కథనాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అయితే ఈ వార్తలను మాత్రం రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఖండిస్తూ వస్తోంది. పుతిన్ ఆరోగ్యంపై వస్తున్న వదంతులు నమ్మొద్దని పేర్కొంది.

Take a Poll

'అవును పుతిన్‌ త్వరలో చనిపోతారు. ఇది నిజం. దీంతో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసిపోతుంది. కాగా.. ఈ యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. త్వరలోనే ఇదంతా ముగిసేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలి' అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అంతేకాక.. ఈయూను విడదీయాలని పుతిన్ పన్నాగం పన్నారని జెలెన్ స్కీ ఆరోపించారు. రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా దృఢంగా నిలబడాలని సమావేశం అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+