కండోమ్‌ల సైజు సరిపోవడం లేదు: మంత్రి, స్పందించిన కంపెనీ
Recommended Video

జింబాబ్వే: జింబాబ్వే ఆరోగ్య శాఖ మంత్రి డేవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జింబాబ్వేకు చైనా నుంచి దిగుమతి అవుతున్న కండోమ్‌ల సైజు చాలా చిన్నగా ఉంటున్నాయని, అవి తమ దేశ పౌరులకు సరిగా సరిపోవడం లేదన్నారు.
ఈ మేరకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అందువల్ల స్వదేశంలోని ఇండస్ట్రియలిస్ట్‌లు దేశ యువకులకు తగిన విధంగా కండోమ్‌ల పరిమాణాన్ని పెంచి, కండోమ్‌ల ఉత్పత్తి ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

మనమే కండోమ్స్ తయారు చేస్తే
కండోమ్‌లు మనమే తయారు చేసుకుంటే విదేశీ దిగుమతులపై పెట్టే ఖర్చు తగ్గుతుందని, మన వాళ్లకు సరిపోయేలా ఉంటాయని సదరు మంత్రి అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా ప్రాంతంలో ఎయిడ్స్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో కండోంలు వాడాలని తాము ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు.

మీకు మరింత కావాలంటే
దేశంలోని ప్రయివేటు కంపెనీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మీకు మరింత బిజినెస్ కావాలంటే ఇక్కడే తయారు చేయండని సూచించారు. ప్రస్తుతం యువత ఇష్టపడుతున్న కండోంలు తాము తయారు చేయడం లేదని సదరు మంత్రి చెప్పారు.

జింబాబ్వే మంత్రి వ్యాఖ్యలపై చైనా కండోమ్ కంపెనీ
జింబాబ్వే మంత్రి డేవిడ్ వ్యాఖ్యలపై చైనా కండోమ్ కంపెనీ స్పందించింది. ఇక నుంచి వివిధ సైజుల్లో కండోంలు తయారు చేస్తామని చెప్పారు. కాగా, న్యూ జింబాబ్వే వెబ్ సైట్ ప్రకారం 2016లో ఆఫ్రికన్ కంట్రీలో 109 మిలియన్ల కండోంలు అమ్ముడయ్యాయి. సరాసరిగా ఒక్కొక్కరు 33 కండోంలు వాడినట్లు.

ఇదీ జింబాబ్వే లెక్క
ప్రపంచంలోనే హెచ్ఐవీ/ఎయిడ్స్ ఇన్‌ఫెక్షన్ బాధితుల్లో జింబాబ్వే దేశం ముందు వరుసలో ఉంది. జింబాబ్వేలోని 13.5 శాతం మంది యువత హెచ్‌ఐవీతో బాధపడుతున్నారు. ప్రతి ఏడాది 40వేల కొత్త కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications