అతన్ని ముంబైకి ఇచ్చేయడం ఢిల్లీ క్యాపిటల్స్ స్వయంకృతాపరాధమే..!
దుబాయ్: వరల్డ్ క్లాస్ బౌలర్, న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్‌కు ఇవ్వడం ఢిల్లీ క్యాపిటల్స్ చేసిన అతిపెద్ద తప్పిదమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అన్నాడు. ఈ బుద్ది తక్కువ నిర్ణయం ఆ జట్టు కొంపముంచడంతో పాటు ముంబైకి మంచి బహుమతి ఇచ్చినట్లైందన్నాడు. క్వాలిఫయర్-1లో బౌల్ట్ తొలి ఓవర్‌లోనే పథ్వీ షా, అజింక్యా రహానేలను డకౌట్‌లుగా పెవిలియన్ చేర్చి ఢిల్లీ పతనాన్ని శాసించిన విషయం తెలిసిందే.
అయితే బౌల్ట్ 2018, 2019 సీజన్లు ఢిల్లీకి ఆడగా.. ఈ సీజన్‌కు మాత్రం ఢిల్లీని అతన్ని వదులుకుంది. ఇక లసిత్ మలింగా దూరమవడంతో బౌల్ట్‌ను ప్రధాన బౌలర్‌గా ఉపయోగించుకున్న ముంబై.. ఆశించిన ఫలితాన్ని రాబట్టింది. ముఖ్యంగా దుబాయ్ పిచ్‌లపై అతను స్వింగ్ రాబట్టి ప్రత్యర్థుల పతనాన్ని శాసించాడు. ఈ నిర్ణయంపై తాజాగా స్పందించిన మూడీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విమర్శలు గుప్పించాడు.

'ట్రెంట్ బౌల్ట్‌ను ట్రేడ్ చేయడం చెత్త నిర్ణయం. టోర్నీ యూఏఈకి తరలుతుందని వారికి తెలియదని నాకు తెలుసు. కానీ స్వింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై ట్రెంట్ బౌల్ట్ చెలరేగుతాడు. ఐపీఎల్ పవర్ ప్లేలో అత్యుత్తమ బౌలర్. అలాంటి అసాధారణ పేసర్‌ను బలమైన ముంబై జట్టుకు గిఫ్ట్‌గా ఇవ్వడం బుద్ది తక్కువ పని. ఇదేదో ముందే చేసుంటే.. కనీసం ఇతర జట్లు అయినా వేలంలో బౌల్ట్ కోసం ప్రయత్నించేవి. అలా కాకుండా బలమైన ముంబైకి అప్పనంగా ఇచ్చి ఆ జట్టును మరింత పటిష్టం చేశారు'అని మూడీ చెప్పుకొచ్చాడు.
ముంబై ఇండియన్స్ ఫినిషర్ హార్దిక్ పాండ్యాపై టామ్ ప్రశంసల జల్లు కురిపించాడు. అలాంటి ఫినిషర్లు చాలా అరుదన్నాడు. క్వాలిఫయర్-1లో పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ ప్రస్తావించిన ఈ ఆసీస్ మాజీ క్రికెటర్.. ఐదు సిక్సర్లతో జట్టుకు భారీ స్కోర్ అందించడం అసాధారణమని కొనియాడాడు. 'హార్దిక్ పాండ్యావంటి ఫినిషర్లు చాలా అరుదు. పాండ్యా ఇలాంటి ఫామ్‌లో ఉంటే అతన్ని ప్రతీ రోజు తీసుకుంటారు. ఎందుకంటే అలాంటి ఫినిషింగ్ టచ్ ఉంటే ఏ జట్టు ఓడిపోదు. ఓ దశలో 170-175 పరుగులే చేస్తుందనుకున్న ముంబై.. పాండ్యా ఇన్నింగ్స్‌తో భారీ స్కోర్ చేయగలిగింది. కేవలం 14 బంతుల్లోనే పాండ్యా ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చేశాడు.












Click it and Unblock the Notifications