ఒక్కొక్కరే బయటికొస్తున్నారు: ఇషాన్ కిషన్‌కూ గర్ల్‌ఫ్రెండ్ ఉందండోయ్: ఈ ఐపీఎల్ స్పెషాలిటీ అదే

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ సారి యంగ్ క్రికెటర్స్ లైమ్‌లైట్‌లోకి వస్తున్నారు. భారీ షాట్లతో ఆకట్టుకుంటున్నారు. భవిష్యత్తులో టీమిండియా ఎలా ఉండోబోతోందోననే విషయాన్ని ఓ ట్రయల్ రూపంలో క్రికెట్ ప్రేమికులకు చూపించేస్తున్నారు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీ.. వంటి అనుభవజ్ఙులు విఫలమౌతోన్న చోట.. యంగ్ క్రికెటర్లు తారాజువ్వలా దూసుకొస్తున్నారు. భవిష్యత్తు తమదేనని స్పష్టం చేస్తున్నారు.

 యంగ్ స్టార్స్‌దే రాజ్యం..

యంగ్ స్టార్స్‌దే రాజ్యం..

కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, సోమవారం రాత్రి నాటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్, అంతకుముందు- రాజస్థాన్ రాయల్స్ టీమ్ నుంచి సంజు శాంసన్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున మయాంక్ అగర్వాల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడ్డికల్.. వీళ్లంతా రైజింగ్ స్టార్ బ్యాట్స్‌మెన్లే. వారిలో కొందరు ఇప్పటికే టీమిండియాలోనూ ఆడారు. వీళ్లు ఎంత బాగా ఆడుతున్న కొద్దీ.. అన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వారి వ్యక్తిగత సమాచారం అంతా బహిర్గతమౌతోంది.

 మొన్న శుభ్‌మన్ గిల్..

మొన్న శుభ్‌మన్ గిల్..

మొన్నటికి మొన్న శుభ్‌మన్ గిల్ వార్తల్లోకి ఎక్కాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్..ఫీల్డింగ్ ఫీట్‌కు ఫిదా అయిన సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్.. ఇచ్చిన రియాక్షన్.. ఇప్పటికీ స్పోర్ట్స్ వరల్డ్‌లో డిస్కషన్స్‌లో ఉంది.ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కొట్టిన ఓ షాట్‌ను శుభ్‌మన్ కుడి వైపు డైవ్ చేస్తూ మరీ అడ్డుకున్న విధానాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోయింది సారా టెండుల్కర్‌. దాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. లవ్ ఎమోజీలను పంపించింది. దీనితో వారిద్దరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు మరింత బలపడ్డాయి.

 ఇషాన్ కిషన్ వ్యవహారం తెరమీదికి..

ఇషాన్ కిషన్ వ్యవహారం తెరమీదికి..

తాజాగా- ఇషాన్ కిషన్ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ చెలరేగిపోయి ఆడిన విషయం తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 58 బంతుల్లో తొమ్మిది సిక్సర్లు రెండు ఫోర్లతో 99 పరుగులు చేశాడతను. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ సూపర్ ఓవర్ దాకా తీసుకెళ్లగలిగిందంటే అది అతని చలవే. ఇషాన్.. ఆ స్థాయిలో ఆడలేకపోయి ఉంటే.. ఈ మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్.. ఏకపక్షంగా గెలిచి ఉండేది.

ఆదితి హుండియా..

ఆదితి హుండియా..

ఒక్క రన్‌తో సెంచరీని మిస్ అయ్యాడు ఇషాన్. 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉదన బౌలింగ్‌లో దేవదత్ పడ్డికల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. అదెలా ఉన్నప్పటికీ.. ఇషాన్ కిషన్ ఆడిన ఇన్నింగ్.. అతని గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న ఆదితి హుండియాను కట్టిపడేసింది. ఇషాన్ నిరాశతో పెవిలియన్ దారి పట్టిన దృశ్యాన్ని స్క్రీన్‌షాట్ తీశారు. దానిపై `ఐ యామ్ సో.. సో ప్రౌడ్ ఆఫ్ యు బేబీ` అని కామెంట్ చేశారు. దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ వ్యవహారంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+