మా సత్తా ఏంటో మాకు తెలుసు..అవతల ఎంత పెద్ద జట్టయినా మా గెలుపు రహస్యం అదే: వార్నర్

దుబాయ్: ఐపీఎల్ టోర్నీ ఆరంభంలో తమ గురించి ఎవరూ మాట్లాడరని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. ఫైనల్స్‌ చేరడం, కప్పు గెలవడం లాంటివి పట్టించుకోరన్నాడు. ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి బెస్ట్‌ బౌలింగ్‌ దళంగా గుర్తింపు తెచ్చుకున్న సన్‌రైజర్స్‌.. బౌలర్ల దమ్ముతోనే ఈ సీజన్‌లోనూ దుమ్మురేపుతున్నది.

మ్యాచ్‌కు ముందు డేవిడ్‌ వార్నర్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ యాజమాన్యం తమపై పూర్తి నమ్మకంతో ఉందని చెప్పాడు. తామంతా ఒక జట్టుగా విజయం సాధించడానికే ఇక్కడ ఆడుతున్నట్లు తెలిపాడు. 'ప్రతీ ఆటగాడు తన వ్యక్తిగత పాత్ర ఏంటో తెలుసుకోవడం, తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడమనేవి మాకు చాలా ముఖ్యమైన విషయాలు. పేపర్‌ మీద రాసి చూస్తే.. మాకంటే బలమైన జట్లు కనిపిస్తాయి. అయితే మేం ఏం చేయగలమనే విషయంపైనే ఆధారపడతాం. ఇప్పటివరకైతే మేం సరైన మార్గంలోనే పయనిస్తున్నాం' అని వార్నర్ పేర్కొన్నాడు.

IPL 2020:We only stick to our basics and defeat the strong teams:Warner

'ఐపీఎల్ టోర్నీ ఆరంభానికి ముందు మా గురించి ఎవరూ మాట్లాడరు. ఫైనల్స్‌కు వెళ్లడం, కప్పు గెలవడం అనేవి పట్టించుకోరు. అలా మాపై ఒత్తిడి ఉండదు. నేనెప్పుడూ ఒక ఆటగాడిగా, కెప్టెన్‌గా చాలా ప్రశాంతంగా ఉంటా. నాతో పాటు కోచ్‌, సిబ్బంది, ఇతర ఆటగాళ్లు అంతా ఇలాగే ఉంటాం. ఆత్మవిశ్వాసంతోనే మేం బరిలోకి దిగుతాం. అలాగే మా యాజమాన్యం నుంచి కూడా మంచి మద్దతు లభిస్తుంది. మాకు వెన్నంటే ఉంటూ అవసరమైన విధంగా సహకరిస్తారు. మేమంతా ఒక కుటుంబంలా ఉంటాం. మాపై వారి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు' అని డేవిడ్ వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+