IPL 2021: డ్యాన్స్ ఇరగదీసిన పాండ్యా బ్రదర్స్: మీరు కూడా ఈ వీడియో చూసేయండి..!

చెన్నై: మొదటి మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన ముంబై ఇండియన్స్.. ఆపై కోల్‌కతా నైట్‌ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లపై అద్భుత విజయాలు అందుకుంది. ఇక మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగనున్న మ్యాచులో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. రెండు వరుస విజయాలతో ముంబై ఆటగాళ్లు అందరూ మంచి జోష్ మీదున్నారు. చెన్నైలో జరగనున్న తదుపరి మ్యాచుకు కాస్త సమయం ఉండడంతో ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూ.. మరో వైపు చిల్ అవుతున్నారు. ముఖ్యంగా ముంబై ఆల్‌రౌండర్‌లు హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు.

పాండ్యా సోదరులు తమ జీవిత భాగస్వాములతో కలిసి సరదాగా ఓ వీడియో చేశారు. ఇందులో కూల్‌ డ్రెసింగ్‌తో హార్దిక్‌-నటాషా, కృనాల్-పంఖురీ సందడి చేశారు. ఆరెంజ్‌ కలర్‌ టీషర్టుల మీద స్మైలీ సింబల్స్‌, నల్లని షార్ట్స్‌ ధరించి అదిరే స్టెప్పులు వేస్తూ ఈ జంటలు అలరించారు. కొన్ని అద్భుత స్టెప్పులతో అభిమానులు అలరించారు. దీనికి వీడియోను హార్దిక్‌ తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. నటాషా కూడా 'ది పాండ్యాస్‌ స్వాగ్‌' అని రాసి ఓ ఫొటోను షేర్‌ చేశారు. వీడియో చూసిన అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

IPL 2021: Hardik Pandya and Krunal Pandya dances,netizens go crazy

కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలన్నీ బయో బబుల్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు దొరికిన సమయాన్ని ఇలా కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు తమ కెరీర్ ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకే ఆడుతున్న విషయం తెలిసిందే. బౌలింగ్, బ్యాటింగ్ చేస్తూ.. ముంబై జట్టుకు పాండ్యా సోదరులు కీలక ఆటగాళ్లుగా మారిపోయారు. ముఖ్యంగా హార్దిక్. ఐపీఎల్‌లో ఇప్పటివరకు కృనాల్ 74 మ్యాచులు ఆడగా.. హార్దిక్ 83 ఆడాడు.

గుజరాత్‌కు చెందిన 27 ఏళ్ల హార్దిక్‌ పాండ్యా 2016లో భారత్‌ తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అతను 11 టెస్టులు, 60 వన్డేలు, 48 టీ20 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సంప్రదాయక ఫార్మాట్‌లో 532, 50 ఓవర్ల ఫార్మాట్‌లో 1247, పొట్టి క్రికెట్‌లో 474 పరుగులు చేశాడు. ఇక 18 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన కృనాల్ 121, మూడు వన్డేల్లో 95 పరుగులు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+